Read more!

English | Telugu

'ఆలియా భట్' కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాక్ యాక్టర్

'నేను సినిమాకి వెళ్తే రో అంతా ఖాళీ ఉండాలి' అంటూ 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ కొడతాడు. డబ్బులు ఉండాలి గానీ.. ఒక్క రో ఏంటి?.. థియేటర్ అంతా బుక్ చేసుకోవచ్చు. తాజాగా ఒక పాకిస్తాన్ నటుడు అదే పని చేశాడు. తన అభిమాన నటి ఆలియా భట్ సినిమా చూడటం కోసం మొత్తం థియేటర్ నే బుక్ చేశాడు.

ఆలియా భట్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'గంగూబాయి కతియావాడి'. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో ఆలియా నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 2012 లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా.. తక్కువ టైంలోనే ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెని అభిమానించే వారిలో పాకిస్తాన్‌ యాక్టర్‌ మునీబ్ బట్‌ కూడా ఉన్నాడు. ఆ అభిమానంతోనే 'గంగుబాయి కతియవాడి' మూవీని తన భార్యతో కలిసి చూసేందుకు దుబాయ్ లోని ఓ థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ఆలియా భట్ కీలక పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆలియా టాలీవుడ్ లో అడుగుపెడుతుంది.