Read more!

English | Telugu

13 రోజుల్లోనే 200 కోట్లు.. 'ద క‌శ్మీర్ ఫైల్స్' ప్ర‌భంజ‌నం

వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన హిందీ చిత్రం 'ద క‌శ్మీర్ ఫైల్స్' క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం కొనసాగుతూనే ఉంది. మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు తక్కువ స్క్రీన్స్ లో విడుదలై రూ.3.55 నెట్ రాబట్టి.. ఆ తర్వాత మౌత్ టాక్ తో స్క్రీన్స్ పెంచుకుంటూ 13 రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

'ద క‌శ్మీర్ ఫైల్స్' మొదటి వారం 97.32 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. రెండు వారం అంతకుమించిన కలెక్షన్స్ తో సత్తా చాటింది.  రెండో వారంలో ఆరురోజుల్లో 102.83 రాబట్టింది. దీంతో ఈ సినిమా 13 రోజుల్లో 200.15 కోట్ల నెట్ వసూలు చేసింది. సోమవారం 12.40 కోట్లు, మంగళవారం 10.25 కోట్లు, బుధవారం 10.03 కోట్లు.. ఇలా వీక్ డేస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఈరోజు(గురువారం) కూడా మరో 10 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముంది.

హిందీలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ పైనా క‌శ్మీర్ ఫైల్స్ ప్రభావం కనిపిస్తుండటం విశేషం.