Facebook Twitter
కాగితానికే

కాగితానికే

                                                                                                                        డా.వై. రామకృష్ణారావు

 

కాగితానికే
మడతలు,ముడతలు
కవితకు
వృద్దాప్యం లేదు.

భావనల తీగ
వాడ కుండా పోషించుకో
బ్రతుకు
పూలు పూస్తుంది.

మీట నొక్కితే
లైటు వెలుగుతుంది
స్పందనా అంతే,
కవిత పలుకుతుంది.