Facebook Twitter
నాకందని నా ప్రపంచం

నాకందని నా ప్రపంచం

                                                                                           - రమాదేవి

అందంగా, అపురూపంగా
ఎవరి ప్రమేయం లేని
ఓ చిన్నిప్రపంచాన్ని సృష్టించుకుంటాను
కాని....నే పూర్తిగా నా ప్రపంచపు ఏకాంతాన్ని
ఆస్వాదించక మునుపే....ఆహ్వానం లేని ఆగమనం

శాశ్వతంగా తోడు నిలిచిపోతాడనుకుని
నిరాకరించక సర్దుకుపోతాను
అంతలో
పలకరించాటానికే కాని
పక్కనుండటానికి కాదంటూ
కదలి పోతాడు... వెళ్ళిపోతాడు
తిరిగి చూస్తే కదా
నా చిన్ని సామ్రాజ్యం
ముక్కచెక్కలుగా....
చిందరవందరగా ....
తిరిగి అందంగా కాకపోయినా
అవసరానికి తగ్గట్టు పేర్చుకునే లోపు
మరో పరిచయం....
మరో అగాధం...