Facebook Twitter
ఈ లోకం ఇంద్రలోకం కాకపోతుందా

ఈ లోకం ఇంద్రలోకం కాకపోతుందా

                                                                                          - శారద అశోకవర్ధన్

ఊరిచివరన ఏరుకావల
    ఉన్న దొక్క గున్నమామిడితోట
    తోటమధ్యన పెంకుటింట్లో
    సరదాగా గడపాలని
    సతినీ సంతతినీ వెంటబెట్టుకెళ్లాడు
    వెంకటపతి!

    చైత్రమాసం పిలుపు వీని
    పులకించిపోయే ప్రకృతి కంత విరజిమ్మిన శోభ
    మల్లెపూలు, మామిడిపళ్లూ, మలయమారుతపుమాటా
    కోకిల పాటా ప్రతిచోటా చూడగానే
    ముగ్ధుడై మురిసిపోయాడు

    పరిసరాలను తిలకిస్తూ
    పులకింతలో తెలిపోయాడు వెంకటపతిరావు.

    అతని దృష్టిని ఆకర్షించింది అందమైన ఆదృశ్యం
    ఎఆవిచెట్టు పైన గూళ్లుకట్టుకున్న కాకులదండు వైనం!
    గుంపులు గుంపులుగా వొస్తాయి,
    ఉదయం మొదలు రాత్రివరకు

    మిసుగూ విరామమూ లేకుండా ఏవోపన్లు చేస్తూనే వుంటాయి .

    కావు కావుమని, కబుర్లు చెప్పుకుంటు
    కలిసి కట్టుగా పోతూవుంటాయి.
    సాయంత్రంనికి గూడుచేరుకుంటాయి.

    ప్రతి రోజూ వెంకటపతి ఈ దృశ్యం చూస్తుంటాడు
    కాకుల గుంపులచూసి ముచ్చటపడి పోతుంటాడు!

    ఆ గుంపులోంచి వినబడిన కోకిల కూత
    కాకులన్నీ అటుకేసి చూశాయా వింత
    కూసిన కోకిల ఎగిరి పోయింది.
    గూడు ఖాళీ అయిపోయింది.

    రావిచెట్టు మీదనుంచి వెళ్లిపోయి
    మామిడిచెట్టున మకాం పెట్టి

    మత్తుగావగరు చిగురులు తిని కడుపునింపుకుంటోంది కోకిల
    దర్జాగా పాడుగంటూ
    ప్రకృతితో ఆడుకుంటు మామిడిచెట్టు కొమ్మల్లోనేవుందిపోయింది
    రావిచెట్టు నీడకూడా చూడకుంటోంది.

    తనే పడగలననే గర్వంతో
    చాటుమాటుగా వుంటోంది కోకిలమ్మ

    పాటరానీ కాకులంటే చులకనగా చూసింది.
    తనే గొప్పదానిలా తన చుట్లూ గిరిగీసుకుంది
    ఎవరితోనూ కలవకుండా ఆకులల్లో దాగి పోయింది.

    చైత్రమాసం వెళ్ళిపోయి వైశాఖం గారానే
    ముదిరిపోయిన మామిడాకులు నోటిలోకి పోకపోగా
    ఆకులూ కాయలూ నేలపైకి రాలిపోగా,

    గూడులేని కోకిలమ్మ గిజగిజలాడింది
    తలదాచగ గూడులేకా చెప్పుకోను తొడు లేక
    వలవలమని ఏడ్చింది

    ఒంటరిగా వుండలేక నాలుగురితో కలవలేక
    పిచ్చేక్కిన కోకిలమ్మ నిట్టూర్పులు విడుస్తూ
    ఓపికంతా చచ్చిపోగా తూలినేల రాలింది.
    కాకులన్నీ ఒక్కుమ్మడిగా కోకిల చుట్టూ చేరినయ్
    వెంకటపతి వెన్నుమీద ఎవరో చరిచినట్టనిపించింది.
    బుఱ్ఱలో ఆలోచన మెరుపులా మెరిసింది.
    కోకిల గర్వం మాని కాకులతో కలిసుంటే?
    తన పాటను కాకులకూ వినిపించీ నేర్నిస్తే?  
    కాకులూ కోకిలమ్మను తమ గూటితో చేర్చుకుంటే?
    తోటంతా హాయి హాయి!
    ప్రతినిత్యం చైత్రమాసం!
    ప్రతి నిమిషం వసంత ఋతువు!
    అంతరాత్మ ఏదో గొణిగింది
    అస్పష్టంగా ఆకాశావాణిలా
    మనిషి మనిషీ భేదాలు వీడి, హెచ్చు తగ్గులు విస్మరించి
    చేయి చేయి కలుపుకుంటే
    సమసమాజం రాకపోతుందా?
    ఈ లోకం ఇంద్రలోకం కన్న తీసిపోతుందా?
    గయలో జ్ఞానం పొందిన బుద్ధిడిలా
    వెంకటపతి నవ్వాడు
    తృప్తిగా నిట్టూర్చాడు!