Facebook Twitter
గజిబిజి నాయకులం

వస్తున్నాం... వస్తున్నాం 
మీ సంపద దోచుకోవడానికి వస్తున్నాం
మీ ఓట్ల కోసం వస్తున్నాం 
మీ ఓట్లతో రాజ్యాధికారంలోకి వస్తున్నాం.
 కంపెనీల పేరు చెప్పి మీ భూమిని లాగేస్తున్నాం
 అభివృద్ధి కావాలంటే?  మీ భూములు మాకు ఇవ్వాలె !
ఉద్యోగాలు కావాలంటే?  ఉన్నదంతా ఇచ్చేయాలి..! 
మీరు అడుక్కోవాలె ..! మేము అధికారం అనుభవించాలె..!
 దిక్కు మొక్కు లేదు, మీకు మేమిద్దరం తప్పా ..!
 వాడు కాకపోతే మేము, మేము కాకపోతే వాడు 
 ఇద్దరం ఒక్కటే ? దోపీడిదారులం..మీరంతా మా బానిసలు, 
మీరు మాకు వేసేది ఓటు ... మేము మీకు పొడిచేది పన్నుపోటు 
మేము  మిమ్మలను, రాష్ట్ర సౌభాగ్యాన్ని తాకట్టు పెట్టేస్తాం 
దొరికిన సంపదనెల్ల దోచేస్తాం...! మిగిలి ఉంటే మీకు ఇచ్చేస్తాం.
 ముద్దుపేరు సంక్షేమం, రాష్ట్రానికి సంక్షోభం .
ఏ దారి లేదు మీకు,..
వాడు రాకపోతే మేము , మేము కాకపోతే వాడు 
దిక్కు ముక్కు లేని జనం మీరు,
మీరు  మారరు మేము మారం 
ఇది ముమ్మాటికి నిజం. 
ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ?
స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ లేడు
గణతంత్రం తర్వాత రాజ్యాంగం లేదు 
ఉన్నదల్లా మేమే దోపిడీదారులం 
మీ ఓటు మాకు , రాజ్యాధికారం మాకు 
రాజ్యం మాదే - భోజ్యం మాదే , 
మీరంతా మా బానిసలు 
ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ?
కులం మాటున కొట్టుకుందాం.
మతం మాటున చంపుకుందాం.
ఒకరినొకరిని నిందించుకుందాం. 
 మీరు మారరు మేము మారం.
 ఉన్నదల్లా ధనస్వామ్యమే !
ఇంకెక్కడి ప్రజాస్వామ్యం!
 నిలువెల్లా దగాధనస్వామ్యం!

 జైహింద్ 
 మీ... మధు,  నేతాజీ కలం