Facebook Twitter
ఇల్లే ఆమె - ఆమే ఇల్లు

తెల్లవారకముందే లేచే తొలి దీపం ఆమె,
ఇంటిని నడిపే నిత్య ఇంజిన్ ఆమె!

వంటింట్లో అన్నపూర్ణ,
పిల్లల పలకలపై సరస్వతి,
ఇంటి గడపకు లక్ష్మీదేవి,
కష్టం వస్తే కాళికాదేవి!
అన్నీ తానై నడిపే
అనంత శక్తి రూపం - గృహిణి!

జీతం లేని ఉద్యోగం,
సెలవు లేని సేవ!
అయినా అలుపు లేని ప్రేమతో,
ఇంటిని గుడిగా మార్చే మంత్రం ఆమెది!

ఆమె చేతి ముగ్గులోనే ఇంటి అందం,
ఆమె నవ్వులోనే ఇంటి వెలుగు!
ఆమె లేని ఇల్లు - ఇల్లు కాదు,
గోడలు మాత్రమే!
ఆమె ఉన్న ఇల్లు - గుడి కాదు,
ప్రేమకు నిలయం!

ఇంటికి పునాది ఇటుక కాదు,
ఇల్లాలి ఓర్పు!
ఇంటికి పైకప్పు సిమెంట్ కాదు,
ఇల్లాలి ప్రేమ!

కాబట్టి,
గృహిణిని గౌరవించు - గృహం శాంతిస్తుంది!
గృహిణిని ప్రేమించు - గృహం వికసిస్తుంది!!!!

 

- డా. ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ)


నవంబర్ 3, జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా