Facebook Twitter
పెరుగుతున్న దూరాలు......

పెరుగుతున్న దూరాలు

                                                                                                                            -కనకదుర్గ

నీకూ నాకూ మధ్య

ఎందుకింత దూరం?

చెప్పలేని అగాధాలు

మనసులు భారమై

మూగపోతున్న భావాలు

ఈ మౌనాలు గుండెని

పిండేస్తుంటే

ఇలా ఎంత దూరం

ఈ ప్రయాణం?

మనసులు ఒంటరివై

దిక్కు తెలియక

అల్లాడుతున్నాయి

ఎటు వెళ్ళాలి?

ఏం చేయాలి?

గమ్యం లేని ఈ పయనం

ఎందాకా?

వేదనావేదనలతో

అలసి సొలసిపోతున్న

మనసులు సేద తీరేదెలా?

ఒకరికొకరుగా,

మనసులో మనసుగా

మెలగాల్సిన హృదయాలు

నేడు మూగవోయి

మౌనంగా రోధిస్తున్నాయి.

ఎదురెదురుగా వున్నా

ఇద్దరిమధ్య చెరపలేని దూరం,

ఇలా కృంగిపోతూ, కృశించిపోతూ

కుమిలిపోతూ

ఎన్నాళిలా?

బదులులేని ఈ ప్రశ్నలతో

ఉరుకుల పరుగుల జీవితంలో

మారుతున్న ఈ ఎలక్ట్రానిక్

ప్రపంచంలో,

మనసులోని మాటలు

పెదవి దాటి రాని

మౌనాలయిపోతూ

కలవలేని సుదూరతీరాలకు

తీసుకెళ్తుంటే

ఏమి చేయలేక

ఈ దూరాలని చెరపలేక

సతమతమవుతున్న

నేటి హై టెక్ జంటే్నా మనది?