Facebook Twitter
మత్తు వదలరా మనిషీ

మత్తు వదలరా మనిషీ

శ్రీమతి శారద అశోకవర్ధన్

మతాల పేరిట పోట్లాటలు
    మనిషి మనిషితో కాట్లాటలు
    దేవునిపేరిట దెబ్బలాటలు
    హద్దులుమీరిన గుద్దులాటలు
    మానవత్వమే మంటగలసిన
    మతం మిగిలే దెవరి కోసం ?
    కులం పేరుతో కుత్తుక తెగిన
    కులంమాత్రం ఎందు కోసం ?
    కులం మతం ఒక ఉన్మాదం
    కుటిలత్వానికి సింహద్వారం !
    'నరకాసురుని' మించిన రక్కసి
    మనిషిని పట్టిన స్వార్ధ పిశాచి
    తరిమికొట్టడ మొకటే మార్గం
    లేకపోతే ప్రగతిశూన్యం !