Facebook Twitter
ఆడపిల్ల - అమృతం

ఆడపిల్ల - అమృతం

మనోహర

 

ఆడపిల్లనమ్మా
అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా
విరజాజులలో విరబూసిన
వెన్నెలమ్మా
స్వచ్చమైన తెల్లదనానికి  రూపం
నేనమ్మా ...
మనసులలో  ఆనందం  చిలికించే
మరువానికి  మరచిపోని  సువాసనలు
నాలోనివే  అవి నాలోనివే...
ఆడపిల్లనమ్మా
అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా  ॥
దోబూచులాటలకు, చందమామ దొంగచూపులకు

 పులకించే  హృదయము నాదమ్మా...
ఆ  హ్రుదయపు  తలపులకి  వయ్యారాలు  

నేర్పించేది  నేనమ్మా
అది  నేనమ్మా ...
ఆడపిల్లనమ్మా
అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా  ||
మంచుపల్లకి  కలల రూపమై  

ఆ కలలో  రాణినై నేనై
పరదాల  జాటున  తలవంచిన
చిత్రమే  నాదమ్మా....
ఆడపిల్లనమ్మా
అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా
విరజాజులలో విరబూసిన
వెన్నెలమ్మా  ||