మహిలో మహిళ
శ్రీమతి శారద అశోకవర్ధన్

మహిళలో వుంది 'మహి'శబ్దం
ఆమెతో ఇమిడివుంది పూర్తిజగం !
వన్యమృగము కూడ తన బిడ్డను పెంచుతుంది స్తన్యమిచ్చి
తనలోని సగం బలాన్నందించి కోరుకుంటుంది
తనను మించినది కావాలని!
మనసిచ్చిన మగువ మురిపిస్తుంది వలచినవాణ్ణి
అందిస్తుంది కోటి స్వర్గాల సుఖాన్ని
రాగ రంజితం చేసి అనురాగాలు పండించే భామిని
సృష్టించగలదు ఇలలోనే స్వర్గాన్ని
అబలగా అణిగిమణిగి అందాల ఆనందాలడోలల్లో
తేలిపోయే కోమలి
కౌగలింత జోరుకే కందిపోయే ఉగ్మలి
రగిలించగలదు రుధిత జ్వాలల్ని
దహించి వేయగలదు దావానలంలా
యావద్ ప్రపంచాన్నీ !
ఆగ్రహిస్తే ఆవేశమొస్తే, అవసరమనిపిస్తే
లిపర కాళిలా అవతారమెత్తి
కదనతొక్కగలదు కత్తి దూయగలదు
దీక్ష్యతో లక్ష్యాన్ని సాధించగలదు.
ఎంతచేసినా ఏం చేసినా
తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే
స్వాతంత్ర్యాన్ని సంపాదించలేక పోతుంది
పురుషుడిచేతిలో ఆటబొమ్మలా ఆడింపబడుతోంది.
నాడు కన్యాశుల్కం నేడు వరకట్నం
పేరు ఏదైతేనేమి రెండు తీసెను మహిళ ప్రాబం !
ఈఆట కజ్టాలంటే, అనర్ధాలనాపాలంటే
ఆడవారికే ఆర్ధిక స్వాతంత్యం కావాలనుకున్నారు
అప్పటికి కాని సమస్యలు సమసి పోవనుకున్నారు.
సమసమాజస్థాపన జరగదనుకున్నారు.
ఆ విద్యను అంతంచేసి ఆడవారు
విద్యా ఉద్యోగాలలో ఉన్నతస్థానాన్ని పొందాలని ఆశిస్తూ
వారిచుట్టూ అల్లుకున్న ముళ్ళతీగెలను పెకిలించివేసి
విజ్ఞానపు దీపాలు వెలిగించడానికి పూనుకున్న
ఎందరో మహనీయుల కృఫలం
నేడు మనం కలుసుకున్న ఈ మందిరం !
ఇది యాభై సంవత్సరాల క్రితం వేసిన పునాది
ఆడజాతికీ అలుముకున్న అంధకారాన్ని
తరిమికొట్టడానికి పలువురునేతలు పనికీననాంది !
ఉన్నవూరు నీ కన్నవారినీ వదిలి
ఒంటరిగా మహిళ ఉండవలసివస్తే
నిలువనీడనిచ్చి 'నేనున్నాలే' అంటూ
నిర్భయంగానిలిచి వెలిగిన కూడలి
ఆంధ్రయువతీ మండలి !
గోల్డెన్ జూబిలీయే కాదు
ఎన్నో ఎన్నెన్నో శతజయంతులు చేసుకోవాలనీ
మరెన్నో ఇంకెన్నో ఇటువంటి భవనాలు వెలిసి
మహిళాభ్యుదయానికి తోడ్పడాలని ఆశిస్తున్నారు
ఆ పరమేశ్వరుని అర్ధిస్తున్నాను
మరోసారి గుర్తుచేస్తున్నాను
మరువబోకండి ఈ సత్యం
మహిళలోనే వుంది 'మహి' శబ్దం
ఆమెతోనే వుంది పూర్తిజగం !!



