Facebook Twitter
ఉగాది ప్రేమ సఖి (కవిత)

ఉగాది ప్రేమ సఖి

 

 

ఈ ఉగాది ప్రేమసఖీ !
నా ఊహల  కంద వేమె !
కలలోనే వచ్చినావు
కలలానే కరగినావు !..ఈ ఉగాది ప్రేమ సఖీ !

 

మధు మాసపు తేరుపైన
మృదు గీతుల నాలపించి
నిదురవోవు యెద పూవున
మధువుగ్రోల వచ్చినావు


                        మురిపెము కలవరకేన?
                        విరులతేరు తరలివరావె !
                        ఓ ఉగాది ప్రేమసఖీ !
                        నాఊహకు రూప మీవె !

 

ఆరు రుచుల ఋతువుల రస
ఫల భారము లెగసి పడగ
కాలప్రగతి మేలి ముసుగు
కళకళ లాడెడి  కాంతుల
కల నర్తన మాడ వచ్చి
నీ నీలను జూపి యంత
నిలువక కలవర పరచే


                        మురిపెము కలవరకేన ?
                         విరులతేరు తరలి రావె !
                         ఓ ఉగాది ప్రేమ సఖీ !
                          నాఊహల కందరావె !

 

చిత్రమైన దీ చైత్ర ప
విత్ర కిల ఋతురాగము
ఎలకోయిల కూజిత స్వర
విలసిత మోహార్ణవము
అనురాగాంబర చుంబిత
అంతరంగ విహ్వలము
ప్రకృతి సహజ  ప్రేమబంధ
మున నొదిగే అద్వైతము !


                        ఈ ఉగాది ప్రెమసఖీ !
                         నాఊహల కందరావె !
                        స్నేహామృతమంద రావె !

- NCV Ranganath