Facebook Twitter
ఆకాశమంత

తండ్రి..
బిడ్డ బుడిబుడి అడుగులకు 
గుండెను పరుస్తాడు 
బిడ్డ తడిపొడి నుడుగులకు 
నవ్వును చిందిస్తాడు 
బిడ్డ వడివడి నడకలకు 
చిటికెనేలు అందిస్తాడు 
బిడ్డ ఆడిపాడే బొమ్మల్లో 
తనో బొమ్మై నిలుస్తాడు 

తనే ఓ అంబారియై 
ఇల్లంతా తిప్పేస్తాడు 
తనే ఓ సంచారియై 
జగమంతా చూపిస్తాడు 

అడిగిన వెంటనే లేదనక కాదనక 
బిడ్డల కోసం రేయనక పగలనక 
శ్రమించి ఆ శ్రమనంతా దాచి 
ప్రేమను అందిస్తాడు
ఎంత ప్రేమనంటే
ఆకాశమంత


 

రచన : వెంకు సనాతని