Facebook Twitter
కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే

ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.
సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి విశ్రాంత కల్పించాను.
కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను.
డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకునే పరిగెత్తుకుని వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను.
రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను.
డబ్బున్న ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.
ప్రైవేట్ డాక్టర్లు ఎంత స్వార్ధపరులో జనాలకు చూపించాను.
వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.
ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధ ని ఎలా అధిగమించాలో నేర్పాను
బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను.
ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను.
క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను.
యాక్సిడెంట్లు లేకుండా చేశాను..
ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను.
ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు ఇప్పుడు ప్రశాంతంగా దొరుకుతుందా అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.
మేము అగ్రరాజ్యాల మని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను..
వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.
గవర్నమెంట్ హాస్పిటల్ లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు అన్న బాధపడేలా చేశాను.
డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది అని ప్రతి ఒక్కరికి నేర్పాను.
మనకెందుకు చావు వస్తుందా అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించే అలా చేశాను..
క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను
ఇలాంటి టైం లో కూడా సేవ చేసే వాళ్ళు ఉంటారు అని సమాజానికి చూపించాను.
లోకం లో మనిషి పుట్టుక అద్భుతం!*
నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!*
*అంతా మట్టే మట్టిలో పుట్టాము! *మట్టిలోకి పోతాము!