Facebook Twitter
స్వేచ్ఛ

స్వేచ్ఛ

ఇరుకు గదుల్లో ఇమిడిపోయిన
ఓ పరుగెత్తే జీవపరికరమా
నవశకాన్ని నాలుగు పాదాలపై
నడిపే ఓ నవచైతన్యమా
ఆ బానిస సంకెళ్ళను తెంచుకొని
‘స్వేచ్ఛ’గా ఎగిరిపో
ఎక్కడికని అడగకు...
ఎవరినీ అడుగకు..
కృత్రిమ నవ్వులతో లేని అపోహాలతో
ఆగిపోకు
నవీనంతో వెనుకపడిపోతున్న
ఓ సంప్రదాయమా
వెల్లకిలా అడ్డం పడుకున్నా ఎవరూ ఆగరూ
వెక్కివెక్కి ఏడ్చినా ఎవరూ పట్టించుకోరు
నువ్వు నిమిత్తం
నీ బ్రతుకు సమాజానికి అంకితం
ఇంతే ఈ నిశ్శబ్ధం
ఇదియే నీ జీవితం

 

-Malleshailu