Facebook Twitter
మంచుదుప్పటి

మంచుదుప్పటి

కాలచక్ర ప్రవాహంలో సూరీడు
మంచుముద్దలా ఉదయిస్తున్నడు
మంచుతెరలను చీల్చుతూ
తొలి వేకువలో 
పండు ముసలిలా మేలుకుంటున్నడు
ప్రకృతి కప్పిన మంచుపొత్తిళ్ళలోంచి
పసిబాలుడై భానుడు కళ్ళుతెరచి ఒళ్ళు విరుచుకుంటూ
మంచు చీకట్లను తరిమేందుకు బుడిబుడి అడుగులతో తడబడుతున్నడు
పుడమినంతా పరచుకున్న మంచుపారావారాన్ని
పారద్రోలేందుకు ఇనుడు 
కాంతికిరణాలతో దండెత్తుతున్నడు
ప్రకృతికాంత చలికి వణుకుతూ
అణువణువునా తుహినకిరణాలతో అలంకరించుకుని 
గజగజలాడుతూ భానోదయానికై వేచియున్న అభిసారికలా.....

 

 

సి. శేఖర్(సియస్సార్)