RELATED EVENTS
EVENTS
గ్రీన్ విల్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

 

 

 

అమెరికా లోని సౌత్ కరోలిన రాష్ట్రం లోని గ్రీన్విల్ నగరం లో స్థానిక హిందుదేవస్థానంలో ఇటీవల గురుపౌర్ణమి రోజున షిరిడి జరిగిన వేడుకలు చాల వైభవంగా జరిగాయి. గ్రీన్విల్ నగరం లో మొట్ట మొదటి సారిగా వేదిక్ సెంటర్ దేవాలయం లో జరిగిన షిర్డీ సాయి పూజలకి మంచి స్పందన వచ్చింది ,దాదాపు 100 దాక భక్తులు వేడుకలకి హాజరు అయ్యారు .ఆలయ పూజారి శ్రీనివాస భట్టాచార్య గారు శాస్త్రోక్తంగా బాబా పూజ నిర్వహించారు అనంతరం బాబా భక్తుల భజనలకి భక్తులు భక్తి పారవశ్యం లో పులకరించి పోయారు.గురుపౌర్ణమి ఆ షిర్డీ సాయి నాదునికి కి కి అత్యంత ప్రియమైన రోజు అని తను మహాసమాధి చెందుతూ ఆరోజు తనని పూజించమని చెప్పిన రోజు అని ,ఆ రోజు పూజించి గురువుగా స్వీకరించినవారిని జన్మ జన్మలకి ఆయన ఆశీస్సులు అందజేస్తారని ఆలయ పూజారి తెలిపారు అనతరం బాబా ఆరతులు, అభిషేకం ,బాబా పల్లకి సేవ జరిగాయి .అనంతరం పదకొండు రకాల నైవేద్యాలతో మహాప్రసాదం పంచిపెట్టారు .బాబా భక్తుల నుండి ప్రతివారం భజనలు జరపడానికి అభ్యర్ధనలు వస్తున్నాయని భక్తుల కోరిక మేరకు ప్రతివారం భజనలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని వేదిక్ సెంటర్ ప్రతినిధులు తెలిపారు ,కార్యక్రమానికి స్థానిక తెలుగు అసోసియేషన్ కూడా తమ సహకారాన్ని అందించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;