RELATED EVENTS
EVENTS
TACA Ugadhi Utsavam in Canada

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) రంగరంగవైభవంగా ఉగాది ఉత్సవాలు మిస్సిసాగ, కెనడాలో మార్చి 24 నాడు జరుపుకున్నారు. ఈ ఉత్సవాలలో దాదాపు 800 లకు పైగా తెలుగు వారు వచ్చి విజయవంతం చేశారు. ఈ ఉత్సవంలో ఉగాది వంటల పోటీలు జరిగాయి. ఉగాది పంచాంగశ్రవణంతో ఉత్సవం ప్రారంభించారు. ఈ ఉత్సవంలో ముఖ్య అతిధిగా గౌరవనీయులు ఇమ్మిగ్రేషన్ మరియు సిటిజెన్షిప్ మంత్రి వర్యులు శ్రీ చార్లెస్ సౌస సభను అలంకరించారు. వారితో పాటు మిస్సిసాగ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దీపిక దామెర్ల గారు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవంలో దాదాపు 30కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు తోటి తెలుగువారితో నాటికలు, సినిమా డాన్సులు, పాటలు దాదాపు ఏడు గంటల పాటు ఏకధాటిగా ప్రదర్శించబడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు పూర్నాలు, బొబ్బట్లతో తాకా వారు భోజనాలు ఏర్పరచారు. తాకా సెక్రటరీ రామచంద్రరావు దుగ్గిన గారు, శశికళ పోతకమూరి, వాణిగుత్తా, ధనలక్ష్మి మునుకుంట్ల, భారతి అట్లూరి జ్యోతి వెలిగించుటకు ఆహ్వానించి కార్యక్రమాలు ప్రారంభించారు.

 

 

తాకా అధ్యక్షులు శ్రీ గంగాధర్ సుఖవాసి ఉగాది మరియు తెలుగు సంస్కృతి గురించి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. తాకా బోర్డు ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చారి సామంతపూడి తాకా భవిషత్తు ప్రణాళికలు, ఆశయాల గురించి వివరించారు. తాకా సాంస్కృతిక కార్యక్రమాలు అరుణకుమార్ లయం నేతృత్వంలో జరిగాయి. శ్రీమతి అపర్ణ కొలిపెర శ్రీమతి దీపిక దామెర్ల గారిని తోడ్కొని రాగా, వెన్నమనేని గంగాధర్ పూల గుత్తులు ఇవ్వగా, లోకేష్ చిలుకూరు సభకు పరిచయం చేశారు. ప్రెసిడెంట్ శ్రీ గంగాధర్ సుఖవాసి మరియు చైర్మన్ చారి సామంతపూడి ఇమ్మిగ్రేషన్ మంత్రి వర్యులు శ్రీ చార్లెస్ సౌస ను తోడ్కొని రాగా శ్రీ శ్రీనాథ్ కుందూరు పౌండేషన్ చైర్మన్ పూల గుత్తులివ్వగా, రమేష్ మునుకుంట్ల సభకు పరిచయం చేశారు. శ్రీ చారి మరియు శ్రీ గంగాధర్ గారు అతిదులను మెమెంటోలతో సత్కరించారు.

 

 

తాకా సేవలకు గాను ప్రభుత్వము తరపున వారు తాకా జ్ఞాపికలు అందచేశారు. శ్రీ వివేక గోవర్థన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అత్యద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ మునాఫ్, శ్రీనివాస్ బాచిన, డెకరేషన్ కమిటీ రవి కోరిపెల్ల, అపర్ణ కొరిపెల్ల, మీనా ముల్పూరి, సాంస్కృతిక కమిటి అరుణకుమార్, వీడియో మరియు ఆడియో కమిటీ రాకేష్ గరికపాటిలను తాకా అధ్యక్షులు అభినందించారు. తాకా కమిటి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఫిబ్రవరిలో తాకా చేపట్టిన ఆటల పోటీలలో గెలుపొందిన వారందరికీ బహుమతులు అందచేశారు. ఈ క్రింది తాకా కమిటీలు ఈ సంక్రాంతి ఉత్సవాలను ఎంతో శ్రమకోర్చి కెనడాలోని తెలుగు వారి కోసం ఏర్పాటు చేశారు. చివరిగా ఉపాధ్యాక్షులు శ్రీ మునాఫ్ అబ్దుల్ అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాలు ముగించారు.

 

 

ఎగ్జిక్యూటివ్ కమిటీ:

ప్రెసిడెంట్: గంగాధర సుఖవాసి

వైస్ ప్రెసిడెంట్: మునాఫ్ అబ్దుల్

జనరల్ సెక్రెటరీ: రామచంద్రరావు దుగ్గిన

కల్చరల్ సెక్రటరీ: అరుణ్ కుమార్ లయం

ట్రెజరర్: లోకేష్ చిల్లకూరు

 

డైరెక్టర్స్:

1. శ్రీనివాసరావు బాచిన

2. రవి కిరణ్ చవ్వా

3. అపర్ణ కొరిపెల్ల

4. వివేక్ గోవర్ధన్

 

బోర్డు ఆఫ్ ట్రస్టీస్:

శ్రీ హనుమంతాచారి సామంతపూడి (చైర్మన్)

శ్రీ రమేష్ మునుకుంట్ల

శ్రీ రవి వారణాసి

శ్రీ లక్ష్మి నారాయణ సూరపనేని

శ్రీ గంగాధరరావు వెన్నమనేసి

 

పౌండేషన్ కమిటీ:

శ్రీ శ్రీనాథ్ కుందూరు (చైర్మన్)

శ్రీ రాకేష్ గరికపాటి

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;