RELATED EVENTS
EVENTS
విజయవంతంగా జరిగిన 2013 కృష్ణా సంబరాలు

 

 

 

 

ప్రవాస కృష్ణా జిల్లా వాసుల సంస్థ , కృష్ణా NRI ఆర్గ్ ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో కృష్ణా సంబరాలు పేరిట జిల్లా వాసుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది . డల్లాస్ నగరం లోని కృష్ణా జిల్లా వాసులంతా పాల్గొని తమ బంధు మిత్రులతో తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు . ఈ సందర్భంగా కృష్ణా జిల్లా లోని ప్రతిభ కలిగి, ఇంటర్మీడియట్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు చదివే పేద విద్యార్ధులను ప్రోత్సహించేందుకై "విద్యా కృష్ణ" అనే పేరుతో ఒక వినూత్న పధకాన్ని ప్రకటించారు . ఈ పధకంలో భాగంగా అర్హులైన విద్యార్ధులకు ప్రతి నెలా Rs 500 చొప్పున విద్యార్ధి తల్లి గారి బ్యాంకులో జమ చేయటం జరుగుతుంది . మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తారు .

 

 

కృష్ణా జిల్లాలో నివసిస్తున్న ప్రవాసుల తల్లిదండ్రుల సంక్షేమానికై  విజయవాడ కేంద్రంగా వచ్చే నవంబర్ / డిసెంబర్ నెలలలో ప్రత్యేక సమ్మేళనం  నిర్వహించాలని నిర్ణయించారు

 



కృష్ణా సంబరాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . చిన్నారులు తమ గాత్ర ,నృత్య అభినయాలతో ఆహుతులను అలరించారు. సంస్థ సభ్యులు స్వహస్తాలతో  తయారు చేసి తెచ్చిన సంప్రదాయ వంటకాలతో జిల్లా రుచులను అందరికి వడ్డించారు .



ఈ కార్యక్రమంలో వందలాది సంస్థ సభ్యులు ,నగర ప్రముఖులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేశారు .

TeluguOne For Your Business
About TeluguOne
;