RELATED EVENTS
EVENTS
చికాగోలో అత్యంత వైభవంగా ఉగాది ఉత్సవాలు

 

 

 

 

Apr 13 న ఎల్జిన్ హైస్కూల్లో జరిగిన ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత,దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజగారు మరియు అలనాటి దూరదర్సన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ గార్లు ముఖ్య అధితులుగా విచ్చేసారు. వీరిని తెలుగుఅసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో అద్యక్షులు రమేష్ గారపాటి మరియు అమెరికా తెలుగు అసోసియేషన్ అద్యక్షులు కరుణాకర్ మాధవరం, హనుమంతరెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి శోభ తమ్మన, శ్రీమతి వనిత వీరవల్లి, శ్రీమతి జానకీ ఆనందవల్లి నాయర్ గార్ల శిష్యులు సంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు. అన్ని రకాల పండుగల థీమ్ తో 40 మంది పిల్లలతో సాహితి కొత్త , బిందు గొంగాటి ఒక కార్యక్రమం రూపొందించారు.

 



మాపల్లె అనే శీర్షికతో శ్రీమతి ప్రసూన వూట్ట్కుర్ మరియు విద్యార్థులు చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఐకమాత్యమే మహాబలమని చాటి చెప్పుతూ యూత్ కమిటీ ఒక నాటిక ప్రదర్శించారు. దీనికి వాణి దిట్టకవి, కిరణ్ మట్టె, భార్గవి నెట్టెం సహకారం అందించారు. సంపూర్ణ రామాయణం లోని ఓ రామయ్య తండ్రి పాటకు చిన్నారులు చేసిన నృత్యం, రవి తోకల చేసిన పడవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాతపస్వి కె.విశ్వనాద్ గారి పలు చిత్రాలలోని పాటలను ఎంచుకొని చిన్నారులు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.

 

 

 

ఈ కార్యక్రమాన్ని శ్రీమతి రాజి కోటంరాజు సమన్వైయం చేశారు. డాన్స్ఎలెమెంట్స్ వారు ప్రదర్శించిన నృత్యం కార్యక్రమనికే వన్నె తెచ్చింది. మిమిక్రి రమేష్ ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన హాస్యవినోదం అందించారు. 6000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చిన మిమిక్రి రమేష్ గారికి టిఏజిసి అధ్యక్షులు శ్రీ రమేష్ గారపాటి మరియు కార్యవర్గం ధ్వని అనుకరణ తపస్వి అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.

 


 

ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కల్చరల్ చైర్ మాలతి దామరాజు, కో చైర్ శివ పసుమర్తి ,సాయి రవి సూరిభోట్ల తమ వంతు కృషిని అందించారు.సాయి గొంగాటి , పద్మాకర్ దామరాజు సాంకేతిక సహకారం అందించారు.టిఏజిసి నిర్వహించిన పలు క్రీడాకార్యక్రామాలలో విజేతలను క్రీడాకార్యదర్శి ప్రదీప్ కందిమళ్ళ వేదికపైకి ఆహ్వానించగా శ్రీ తమ్మారెడ్డి భారద్వాజ గారి చేతుల మీదుగా ప్రతి విభాగంలోని ముగ్గురు ఉత్తమ క్రీడాకారులకు వరుసగా స్వర్ణ,రజత,కాంస్య పతకాలను అందించారు. ఉగాదిపచ్చడి తో అందించిన విందుభోజనం అందరినీ మెప్పించింది.12మంది ప్రముఖ భారతీయ మహిళల చిత్రాలతో వర్ణభరితంగా రూపొందించిన విజయనామ సంవత్సర తెలుగు క్యాలెండర్ ను శ్రీనివాస్ పెదమల్లు గారు తయారు చేయించి సబ్యులందరికి అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి టిఏజిసి కార్యవర్గ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేశారు.
 

TeluguOne For Your Business
About TeluguOne
;