RELATED EVENTS
EVENTS
అమెరికాలో కూచిపూడి అందెల సవ్వడి

న్యూ జెర్సీ: డిసెంబర్ 30: అమెరికాలో తెలుగు కళకు కొండంత అండగా నిలుస్తూ.. కూచిపూడితో అమెరికా తెలుగు మనస్సుల్లో అందెల సవ్వడి చేస్తున్న నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్..  మరో నృత్య ప్రదర్శనతో ముందుకొచ్చింది. అమెరికాలో  నృత్య  మాధవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్  కూచిపూడి సుమమాల 3 ప్రదర్శనకు గజ్జె కట్టింది..

 

న్యూజెర్సీలోని  బ్రిడ్జివాటర్ శ్రీ బాలాజీ దేవాలయం ఆడిటోరియం అందుకు వేదికైంది.. క్రిక్కిరిసిన కళాభిమానుల మధ్య, శుక్రవారం సాయంత్రం కూచిపూడి సుమమాల, ఓం గురుభ్యోనమ: అనే నృత్యముతో ప్రారంభమై, భావయామి రామలింగేశ్వర, వేడుకొందామా, మరకత మణిమయ చేల,నటేశ కౌత్వం, ఆనంద తాండవం, భో శంభో, కొలువైతివా రంగ సాయి, ఎందఱో మహానుభావులు వంటి అత్యత్భుతమైన ప్రదర్శనలతో ఆహూతులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

 

శ్రీమతి దివ్య ఏలూరి నృత్య దర్శకత్వంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత గోద రంగనాదీయంఅనే నృత్య రూపాకాన్ని కూడా చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు.. ఈ రూపకంలో చిన్నారులు నృత్యం తో పాటు.. అభినయం కూడా సభికులను మంత్ర ముగ్థులను చేసింది..  హిందూ సాంప్రదాయంలో, ధనుర్మాసం లో శ్రీ మహా విష్ణువు ఆరాధన అత్యంత విశేషం గా పరిగణింప బడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీ గోదా దేవి కళ్యాణం ను  ఒక ప్రధాన కార్యక్రమం లో ప్రతీ ఏటా ధనుర్మాసం లో జరుపుతుంటారు.  ఈ కార్యక్రమ సూత్రధారి, స్కూల్ డైరెక్టర్  వేణు ఏలూరి కళాకారులకు అవార్డు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.  

 

న్యూ జెర్సీ కాంగ్రెస్ మాన్ శ్రీ ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిధిగా విచ్చేసి కళాకారులను, కూచిపూడి కళను ప్రోత్సహిస్తున్న నృత్య మాధవి స్కూల్ కళా దర్శకురాలు దివ్య ఏలూరి గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో భాగంగా 2010-2011 సంవత్సరానికి ఇండియా టూర్ అవార్డ్స్ సందర్భంగా అవార్డు గ్రహీతలకు తామ్ర ఫలకాలతో పాటుగా నాట్య ప్రభ బిరుదులను ప్రదానం చేసారు.  ఈ కార్యక్రమానికి కోరియాన్డర్ రెస్టారంట్ వారు విందు ఏర్పాటు చేసారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;