RELATED EVENTS
EVENTS
హాంగ్ కాంగ్ లో ఉగాది వేడుకలు 2013

 

 

 

భారతీయులే తమ సంస్కృతీ ని నిర్లక్ష్యం చేస్తూ , ప్రాశ్చాత్య నాగరికతను ఆలింగనం చేసుకుంటున్న తరుణం లో , ప్రవాస భారతీయులు తెలుగుగడ్డకు దూరంగా ఆధునిక నాకరికత మద్య కాలం గడుపుతున్న తెలుగువారు విదేశీ గడ్డపై తెలుగుజాతి గొప్పదనాన్ని తెలుగువారి సంస్క్రతిని చాటిచెప్పేలా ‘ఉగాది’ వేడుకలు జరిపి తెలుగుతల్లికి అసలైన నీరాజనాలు పలికారు. అంతే కాదు హాంగ్ కాంగ్ లో ని విదేశీయులు , కూచిపూడి , భరతనాట్యం లాంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలను ఎంతో మక్కువగా నేర్చుకుంటూ , ఉగాది వేడుకలలో ప్రదర్శనలు చెయ్యటం ఒక విశేషం !

 

 

 


శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదిని హాంగ్ కాంగ్   లోని  తెలుగు వాళ్లు ఉగాది  వేడుకలు  ఇటీవల  స్థానిక ఇండియన్ రిక్రియేషన్ క్లబ్ లో  తెలుగు ప్రజలు ఘనంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా , శ్రీమతి జయ పీసపాటి గారి ఆధ్వర్యంలో తెలుగు సమాఖ్య "ఉగాది , వనభోజనాలు , దసరా నవరాత్రులు "  లాంటి పండుగలను మహా సరదాగా జరుపులున్తున్నారు .  ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు వివిధ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలకు ఆటల పోటీలు, పిల్లల పాటలు , పిల్లల కూచిపూడి నాట్యం , భరతనాట్యం  కార్యక్రమాలలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

 


ఈ వేడుకల్లో  మన చిన్నారులు, చైనీస్ , సిన్గాపోరేయన్స్ , జపనీస్ మొదలగు దేశస్తులు కూడిన నృత్య బృందాలు - హరిఒమ్ డాన్సు సొసైటీ , కాస్మిక్ డాన్సు గ్రూప్ మరియు మకౌకు చెందిన బాలీవుడ్ ద్రేంజ్ గ్రూప్ కి చెందిన నర్తకి మణులు  చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.


TeluguOne For Your Business
About TeluguOne
;