క్రికెటర్ అశ్విన్‌కు యువరాజ్ తండ్రి క్లాస్.. ఎందుకో తెలుసా?

Publish Date:Mar 26, 2026

Advertisement

క్రికెట్ దిగ్గజం సచిన్‌‌టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ విషయంలో క్రికెట్ కోచ్ యోగ్‌రాజ్‌సింగ్ భారత్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్  తండ్రి  యోగ్‌రాజ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.  

తాజాగా ఆయన అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తి రేపుతోంది.  2022లో యోగ్‌రాజ్ వద్ద అర్జున్ టెండ్కూలర్ శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పొందాడు. అలానే రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 వేలంలో అర్జున్‌ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌  30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో అర్జున్‌కు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌  తుది జట్టులో చోటు  దక్కడం అసాధ్యమని.. అలానే ఒకవేళ చోటు దక్కినా అతడు రాణించడం అనుమానమేనంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై  యోగ్‌రాజ్‌ ఘాటుగా స్పందించారు. అశ్విన్ కు ఓ రేంజ్ లో  క్లాస్ పీకారు. టీవీల్లో కూర్చొని ఒకరి ప్రతిభను డిసైడ్‌ చేయడానికి అశ్విన్ కు ఉన్న అర్హత ఎంటంటూ నిలదీశారు.  

ఒక ప్లేయర్‌ను.. నువు చేయలేవు, నీవు ఆడలేవు, నీకు ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు  కౌంటర్ ఇచ్చారు. నిరుత్సాహ పరిచే ఇలాంటి మాటలు ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతాయన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ కుమారుడిగా  అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉందన్న యోగరాజ్..  ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయన్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అర్జున్‌కుతప్పక అవకాశాలు వస్తాయని, వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటాడని  విశ్వాసం వ్యక్తం చేశాడు.

By
en-us Political News

  
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం నాడు అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
భారతదేశ రాజకీయ, చట్టపరమైన రంగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.