పాకిస్థాన్ దళారీ దేశం.. కేంద్ర మంత్రి జైశంకర్
Publish Date:Mar 25, 2026
Advertisement
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేలా వాషింగ్టన్-టెహ్రాన్‌తో మధ్వవర్తిత్వం వహించేందుకు పాక్ ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దం ఉద్రిక్తతలపై కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ రాయబారం ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఆ దేశాన్ని దళారీ దేశంగా అభివర్ణించారు. పాకిస్థాన్‌లాగా భారతదేశం దళారీ దేశం కాదని అన్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ దళారీ పోషిందన్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడంతో మధ్యవర్తిత్వం వహించడానికి పాక్ ముందుకు వచ్చింది. అగ్రదేశం శాంతి ప్రణాళికను ఇరాన్ కు చేరవేసింది. చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకూ సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఎందుకు మౌనంగా ఉందని విపక్షాలు ప్రశ్నించినప్పుడు, భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉందని.. ఎన్నడూ దళారీ దేశంగా వ్యవహరించదని జైశంకర్ వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/pakistan-a-client-state-36-216173.html





