ప్రేమ విఫలమై యువ నర్సు ఆత్మహత్య

Publish Date:Mar 3, 2026

Advertisement

 

మియాపూర్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమవడంతో యువ నర్సు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మేఘావతు సోను భాయ్ (20) అనే యువతి హైదరాబాద్ నగరానికి వచ్చి మియాపూర్ మక్తలోని ఓ హాస్టల్‌లో ఉంటూ, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు విధులు నిర్వహిస్తోంది. 

గత సంవత్సరం కాలంగా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఈ ప్రేమ జంట మధ్య విభేదాలు తలెత్తింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోను భాయ్  హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో  గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఘటనను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు  సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ  మార్చరి కి తరలించారు. ప్రేమ వ్యవహారం కారణం గానే ఈ ఘటన జరిగిందా? లేక ఇతర కారణాలున్నా యా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

By
en-us Political News

  
ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు.
తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం.
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.