Publish Date:Jun 19, 2025
వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, వారిలో ఒకరు జగన్ కాన్వాయ్ లో వాహనం ఢీ కొని మరణిస్తే.. మరొకరు ఎండలో ర్యాలీ కారణంగా మరణించారనీ ఆయన తెలిపారు. ఆ ఇద్దరి మృతికీ జగనే బాధ్యత వహించాలనన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కన్నా.. జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు.
అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారన్నారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు.
ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ అబద్ధపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్న కన్నా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా జనం పట్టించుకోరన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-violated-rules-39-200307.html
అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి ఘన సంప్రదాయ స్వాగతం పలికింది.
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్‌లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.
సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పునిచ్చారు
గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది.
ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్‌లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు.