LATEST NEWS
  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ఆరోపణలపై  పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు.  కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేశారు. తాజా నివేదికలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నేడే, రేపో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
  సీఎం చంద్రబాబు బృందం సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా 2 వేలమంది తెలుగువారితో సమావేశమయ్యారు.  ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి తెలిపారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్‌ ద్వారా ఆర్సెల్లార్‌ మిత్తల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.  2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను వైసీపీ అధినేత జగన్‌ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్‌రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్‌ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు.  ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం. హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాందేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? జగన్  తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ లోకేశ్ తెలిపారు మధ్యం కుంభకోణ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక లిక్కర్‌ కంపెనీ రూ.400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని చెప్పారు. బంగారంతో లిక్కర్‌ తయారు చేయలేరు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్‌ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే కాదని ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆయనకు మంత్రి నారా లోకేష్‌ సవాల్ విసిరారు
  మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది.  మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి రోడ్డు పైకి భారీగా చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ మాలకొండయ్యకు గాయాలయ్యాయి.  ఓ సీఐ కిందపడిపోయారు.  కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్‌ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది.  దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  
  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్  చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.   ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.   
తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలవంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది. ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయనీ, అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయనీ పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  తిరుమలలో పుణ్యక్షేత్రంలో  కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల  మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
ALSO ON TELUGUONE N E W S
  వైవిధ్యమైన కంటెంట్‌తో అలరిస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.    ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. "దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ఇప్పుడు దేవా కట్టా గారి కోసం ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను"అని అన్నారు.   దేవా కట్టా మాట్లాడుతూ .. "మయసభ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌‌లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.   సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ .. "కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించాం. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నాం." అని అన్నారు.   సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎంత అందంగా నెరేట్ చేశారో.. అంతే అద్భుతంగా తీశారు. ఎంతో గొప్ప నటీనటులు అందరూ ఆ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దేవా కట్టా గారు మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. దేవా గారు ఈ సిరీస్ కోసం వందకు 150 శాతం కష్టపడ్డారు. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌కు చేసి పెట్టిన దేవా కట్టా గారికి థాంక్స్" అని అన్నారు.   ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. "పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా గారు పని చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌ని సపోర్ట్ చేస్తున్న సోనీ లివ్‌ టీంకు థాంక్స్. దేవా గారు కన్న కలను ‘మయసభ’ టీం నిజం చేసింది. శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.   చైతన్య రావ్ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గారు చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్ సర్, సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం అదృష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్‌లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.   నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ .. "మయసభ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది" అని అన్నారు.   నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ .. ‘"దేవా గారు ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.   చరితా వర్మ మాట్లాడుతూ .. "నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఆది, చైతన్య గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.   నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. ‘మయసభ’ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.   మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ మాట్లాడుతూ .. "మయసభ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దేవా గారికి థాంక్స్. బృందా తరువాత సోనీ లివ్‌లో ఇది నాకు రెండో ప్రాజెక్ట్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.   డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా గారికి, సోనీ లివ్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 7న బ్లాస్ అయ్యేలా ‘మయసభ’ రాబోతోంది" అని అన్నారు.  
Yash Raj Films released the first track of War 2, a groovy romantic track, Aavan Jaavan, featuring superstars Hrithik Roshan & Kiara Advani in their coolest ever self! The team behind the blockbuster song Kesariya from Brahmastra have reunited in Aavan Jaavan, thanks to Ayan Mukerji.  So, composer Pritam, lyricist Amitabh Bhattacharya and singer Arijit Singh have again given India a romantic song to cherish. The female vocals for the song are done by the young and versatile singer Nikhita Gandhi. Aavan Jaavan is currently winning the internet due to Hrithik & Kiara’s infectious chemistry and effortless vibe. YRF had announced yesterday that Aavan Jaavan will be the company’s gift to Kiara Advani and her massive, loyal fan base to mark her birthday and looks like the song is already a massive winner. War 2 has been directed by Ayan Mukerji and is produced by Aditya Chopra. War 2 releases on August 14th in theatres worldwide in Hindi, Telugu & Tamil.
ఏ హీరోయిన్‌ అయినా తరచూ ఒకే వ్యక్తితో కనిపిస్తుంటే.. వారి మధ్య ఏదో ఉందనే పుకారు షికారు చేయడం సహజమే. ముఖ్యంగా ఇలాంటివి బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ డేటింగ్‌ చేయడం, ఆ తర్వాత విడిపోవడం అనేది సర్వసాధారణం. ఈమధ్యకాలంలో సమంత, రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. అది నిజమేనన్నట్టు వారి ప్రవర్తన కూడా ఉండడంతో సోషల్‌ మీడియాలో ఇదే హాట్‌ డిస్కషన్‌గా మారింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. అంతకుముందు ది ఫ్యామిలీ మ్యాన్‌2లో కూడా కనిపించింది. ఈ రెండు వెబ్‌ సిరీస్‌లకు రాజ్‌, డి.కె. దర్శకులు. ఆ వెబ్‌ సిరీస్‌ల తర్వాత సమంత, రాజ్‌ నిడిమోరు మధ్య బంధం బలపడిందనే రూమర్‌ వినిపించింది. అనేక మార్లు ఇద్దరూ కలిసి కనిపించడమే దానికి కారణం. ఇద్దరూ కలిసి హాలిడేకి వెళ్లడం, ఏదో ఒకచోట ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగని పబ్లిక్‌గా కలిసి కనిపించడం కూడా మానలేదు. అంతేకాదు, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో రాజ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తోంది సమంత. తాజాగా ముంబై వీధుల్లో సమంత, రాజ్‌ కలిసి ఒకే కారులో వెళ్తున్న దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. వారిద్దరూ ఒక రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేసి తిరిగి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్యతో సమంత విడిపోయి నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పుడు రాజ్‌తో డేటింగ్‌ చేస్తోందనే వార్త నిజమైతే త్వరలోనే వీరి బంధానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. 
  ఒక్కోసారి ఒకరు నటించాల్సిన సినిమా మరొకరికి వెళ్తుంటుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అయినా, లేదంటే ఆ పాత్రకి పేరొచ్చినా.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తాయి. పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. ఆ సినిమాని వదులుకొని మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. తాజాగా శ్రీలీల విషయంలో అదే జరుగుతోంది. (Kingdom)   విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'కింగ్‌డమ్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గురువారం(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించాల్సి ఉంది. 2023లో ప్రకటించిన ఈ సినిమా ఆలస్యమవుతుందనో లేదా శ్రీలీల వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్లనో.. కారణమేంటో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ లోకి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వచ్చింది. అయితే 'కింగ్‌డమ్‌' విడుదలయ్యాక.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   నేడు థియేటర్లలో అడుగుపెట్టిన 'కింగ్‌డమ్‌' నెగటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే.. అసలు ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదో కొన్ని సీన్స్ లో అలా వచ్చి వెళ్తుంది అంతే. నిజం చెప్పాలంటే అసలు ఆ పాత్ర లేకపోయినా.. కథకి వచ్చే నష్టమేమీ లేదు. ఇది చాలదు అన్నట్టు.. ఇందులో మూడో సాంగ్స్ ఉంటే, వాటిలో 'హృదయం లోపల' సాంగ్ లో హీరోయిన్ కనిపిస్తుంది. కానీ ఆ సాంగ్ ని కూడా.. సినిమా లోనుంచి తీసేశారు. దీంతో 'కింగ్‌డమ్‌'లో హీరోయిన్ పాత్ర ఏదో మొక్కుబడి అన్నట్టుగా ఉంది.   ఇటీవల శ్రీలీల వరుస పరాజయాలను చూసింది. ఇలాంటి సమయంలో 'కింగ్‌డమ్‌'లో భాగమై ఉంటే.. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్ర చేసిందనే విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ఆ విమర్శల నుంచి శ్రీలీల తెలివిగా తప్పించుకుందనే చెప్పవచ్చు.   కాగా, శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులో 'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో 'ఆషికీ-3', తమిళ్ లో 'పరాశక్తి' చిత్రాల్లో నటిస్తోంది.  
సాధారణంగా కోట్లలో చీటింగ్‌ చేసాడని, పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారని మనకు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా మోసాలు జరగడం అనేది అరుదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో విషయంలో అదే జరిగింది. అతని పేరు ఎస్‌.శ్రీనివాస్‌. ఇప్పటివరకు 60 సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. విశేషం ఏమిటంటే.. తనకు తనే ‘పవర్‌స్టార్‌’ అనే బిరుదు తన పేరు ముందు తగిలించుకున్నాడు. తమిళ ప్రేక్షకులు కూడా అతన్ని పవర్‌స్టార్‌ అనే పిలుస్తారు.  సినిమాలు చేయడంతో పాటు ఒక ఫైనాన్స్‌ కంపెనీని కూడా నడుపుతున్నాడు శ్రీనివాసన్‌. ఆ క్రమంలో ఢల్లీికి చెందిన ‘బ్లూ కోస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌’ సంస్థ 1000 కోట్ల రుణం కోసం శ్రీనివాస్‌ను సంప్రదించింది. లోన్‌ ఇప్పిస్తానని, అందుకుగాను తనకు 5 కోట్లు ఇవ్వాలని అతను అడిగాడు. అడిగినట్టుగానే 5 కోట్లు చెల్లించింది ఆ సంస్థ. నెలరోజుల్లో లోన్‌ వస్తుందని, రాని పక్షంలో తీసుకున్న 5 కోట్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆ సంస్థ డబ్బు చెల్లించి నెలరోజులు దాటిపోయింది. కానీ, లోన్‌ విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్‌ లేకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసును విచారణకు తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ సంస్థ చెల్లించిన 5 కోట్లు శ్రీనివాసన్‌, అతని భార్య ఎకౌంట్‌కు బదిలీ అయినట్టు తమ విచారణలో గుర్తించారు. ఆ డబ్బును తన వ్యక్తిగత అవసరాల కోసం, సినిమాల నిర్మాణానికి వాడుకున్నట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కాకుండా 2018 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు శ్రీనివాసన్‌. దీంతో అతన్ని నేరస్తుడుగా ప్రకటించింది కోర్టు. చివరికి చెన్నయ్‌లో శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసి ఢల్లీికి తరలించారు పోలీసులు.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Vijay Deverakonda has been facing a huge slump in his career. Liger, Kushi, Family Star have become huge disasters and the actor needs a big success in his career. His Kingdom released today and initial talk has been mixed. But his rumoured girlfriend, Rashmika Mandanna wished him for his success.  She wrote, "I know how much this means to you and all those who love you @TheDeverakonda!! MANAM KOTTINAM." She seemed to be genuinely happy and indirectly stated that it makes her happy too, as she added people who all love you.    Vijay Deverakonda replied to her by commenting, "Manam kottinam". It looks like both of them have been waiting for Kingdom in a big way. While the rumors about their relationship are ripe, they both have been stating that they are great friends and will stay the way for long.  The rumoured couple keep this social media PDA going on and they have been to trips together, too. Currently, Rashmika Mandanna is working in Girlfriend and Mysaa movies while Vijay officially did not yet announce his next, while there have been many speculations.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తన నటనతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న విజయ్‌ సేతుపతికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. విభిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించేందుకు ఇష్టపడే విజయ్‌పై తాజాగా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణ వచ్చింది.  దీనిపై స్పందించిన విజయ్‌.. ‘నా గురించి మీ అందరికీ తెలుసు. ఆ మహిళ నాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా టీమ్‌ ఆమెపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. నన్ను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నవారు ఆ పోస్ట్‌ చూసి నవ్వుకున్నారు. అయితే నా కుటుంబం మాత్రం ఎంతో వేదనకు గురైంది. ‘ఇలాంటివి పట్టించుకోవద్దు. తను ఫేమస్‌ కావడం కోసం చేసిన ఆరోపణ చేసి ఉంటుంది. ఎంజాయ్‌ చెయ్యనివ్వండి’ అని మా ఫ్యామిలీ మెంబర్స్‌తో చెప్పాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ, ఏనాడూ భయపడలేదు. ఇలాంటి విషయాల గురించి నేను అస్సలు బాధపడను’ అన్నారు.  కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది బాగా ఉందని, దాని వల్ల తన స్నేహితురాలు బాధపడిందని ఓ మహిళ పోస్ట్‌ పెట్టింది. అందులో విజయ్‌ సేతుపతి పేరును ప్రస్తావించింది. అయితే ఆ పోస్ట్‌ను కొన్ని గంటల తర్వాత డిలీట్‌ చేసింది. దీంతో విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెపై కామెంట్ల వర్షం కురిపించారు. విజయ్‌ గురించి పోస్ట్‌లో పెట్టింది నిజమే అయితే ఎందుకు డిలీట్‌ చేశారంటూ సీరియస్‌ అయ్యారు. వెంటనే ఆ మహిళ దానికి వివరణ ఇస్తూ మరో పోస్ట్‌ పెట్టింది. కోపంతోనే అలా చేశానని పేర్కొంది. అయితే అది ఇంతలా వైరల్‌ అవుతుందనుకోలేదని తెలిపింది.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Cast: Vijay Deverakonda, Bhagyashri Borse, Satyadev, Venkitesh V. P., Ayyappa P. Sharma, Mahesh Achanta, Rajkumar Kasireddy Crew:  Cinematography by Girish Gangadharan, Jomon T. John Music by Anirudh Ravichander Editing by Navin Nooli Written and Directed by Gowtam Tinnanuri Produced by Naga Vamsi, Sai Soujanya   Vijay Deverakonda has been struggling at the box office to find a proper success, ever since the debacle of Dear Comrade. His highly anticipated films like Liger, Kushi, Family Star have ended being his career biggest disasters. Now, his most awaited Kingdom, in the direction of Jersey director Gowtam Tinnanuri, released on 31st July, promising to provide him respite from disasters at the box office. Let's discuss about the film, in detail.    Plot:  Constable Suri (Vijay Deverakonda) tries to find his elder brother Siva (Satyadev), who went missing 18 years ago. His ability to think brilliantly and do anything, attracts a RAW head. He plots him as a spy in Jaffna, where he needs to convince Siva, who became leader of smugglers gang in a near-by island Divi, to comeback home. The island is filled with Telugu people from Srikakulam, who have fled away after occupation of East India Company, in their land.    Suri gets trained to complete his mission but in Divi, he gets to know about Murugan (Venkitesh), who wants to torture people of Divi and he is a part of big cartel. On the other hand, people of Divi, under the leadership of Swamiji (Ayyappa P. Sharma), wait for the return of their King, who left them 70 years ago. Can Suri convince Siva to leave his life and come back with him? Will Indian Government help him? Will people of Divi help him? Watch the movie to know more.  Analysis:  Vijay Deverakonda's screen presence and his acting skills have been on full display. He tried his best to be the part but writing did not support him as much as it needed for such a film. His acting prowess is full on display in few scenes and only his screen presence saves action sequences. Satyadev got best role after Vijay and he did perform well. Even all other actors have done their job well but Bhagyashri Borse doesn't have much to do.  Production Values by Suryadevara Naga Vamsi and Sai Soujanya are grand. Girish Gangadharan and Jomon T. John have presented the story visually brining Gowtam Tinnanuri's vision to life. But the problem lies with his vision and writing. He tried to take narrative in different directions but it loses purpose from the get-go. Gowtam tried to infuse different elements into the narrative but failed to cohesively build them to a conclusion.  Everything feels random and rushed. Even the climax seems to have been cut short after shooting a lot of scenes at places. The disjointed portions and rush in edit indicates that the movie team seems to have been sitting a long time on this project. Trying many things to change and see, what works. The familiarity with such plotlines and parallels with Suriya's Retro, Prabhas Chatrapathi and many films cannot be denied.  Sending a Spy to any country is not as easy as portrayed and there are many sequences that don't have enough impact. The action sequences are all planned on huge scale but edit pattern and rush to finish line don't help them to be interesting. Majority of the film seems to have been edited several times to come to one conclusion. Purposelessness, over emphasize on Satyadev's character, passive heroism don't really elevate the narrative as anticipated.  Anirudh Ravichander's music also lacks impact. The movie feels like a compulsion to execute a story in two parts following patterns of KGF Universe. It doesn't really bode well to the characters created by Gowtam. When a hero enters on a mission, many want him to either succeed or fail but not just roam around aimlessly. Even for circumstances to help him, there should be thick writing plotting the triggers and pay-offs. Not an attempt that we expect from a filmmaker like Gowtam Tinnanuri.    Bottomline:  While there is a King, there is no proper Kingdom, for him, to rule.    Rating: 2/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Organisation recommends viewers' discretion before reacting to this opinionated take. 
  తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్,  సంగీతం: అనిరుధ్ రవిచందర్ డీఓపీ: జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన ఆర్ట్: అవినాష్‌ కొల్లా ఎడిటర్: నవీన్ నూలి దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ విడుదల తేదీ: జూలై 31, 2025    'పెళ్ళి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ.. తర్వాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. విజయ్ నటించిన గత ఐదు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో 'కింగ్‌డమ్'పైనే ఆశలు పెట్టుకున్నాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'కింగ్‌డమ్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.   కథ: సూరి(విజయ్ దేవరకొండ) ఒక కానిస్టేబుల్. 18 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి పారిపోయిన తన అన్నయ్య శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. సూరి ధైర్యం, తెలివితేటలు తెలుసుకున్న సీనియర్ ఆఫీసర్.. ఒక అండర్ కవర్ ఆపరేషన్ అప్పగిస్తాడు. శ్రీలంక తీరంలో భారత్ కి చెందిన తెగ నివసిస్తుంది. వాళ్ళు అక్కడి స్వగ్లర్ల కింద పనిచేస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. ఆ గ్యాంగ్ కి లీడర్ సూరి అన్నయ్య శివనే. తన అన్నయ్యని తిరిగి ఇండియాకి తీసుకురావాలనే లక్ష్యంలో సూరి అక్కడికి బయల్దేరతాడు. నోటితో కాకుండా ఆయుధాలతో మాట్లాడే రాక్షసులు లాంటి మనుషులున్న ఆ ప్రాంతానికి సూరి ఎలా వెళ్ళగలిగాడు? శివని ఇండియాకి తీసుకొనివచ్చాడా? అసలు ఆ తెగతో శివకి, సూరికి సంబంధం ఏంటి? అండర్ కవర్ ఆపరేషన్ వెనకున్న అసలు లక్ష్యం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: కింగ్‌డమ్ కథ పెద్దది కాదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ చిత్ర కథ ఏంటో అవగాహన వస్తుంది. లేదా సినిమా ప్రారంభమైన కాసేపటికే కథ ఏంటో అర్థమైపోతుంది. ఇలా చిన్న కథని తీసుకొని, దానిని ముందే ఆడియన్స్ కి చెప్పేసి.. రెండున్నర గంటలు కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. రైటింగ్ తో మ్యాజిక్ చేయాలి. కానీ, అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. ఈ మధ్య అవసరమున్నా లేకున్నా రెండు భాగాలుగా కథ చెప్పడం ట్రెండ్ అయిపోయింది. దాని వల్ల మొదటికే మోసం వస్తుంది. సెకండ్ పార్ట్ కోసం మంచి కంటెంట్ ఉండాలనే ఉద్దేశంతో.. ఫస్ట్ పార్ట్ ని డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు కింగ్‌డమ్ విషయంలోనూ అదే జరిగింది. తెలుగులో తీసింది రెండు సినిమాలే అయినప్పటికీ గౌతమ్ తిన్ననూరి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో తన బలం రైటింగ్ అని నిరూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కింగ్‌డమ్ లో మాత్రం ఆ ఎమోషన్సే మిస్ అయ్యాయి. 18 ఏళ్ళ క్రితం పారిపోయి గ్యాంగ్ స్టర్ లా మారిన అన్నను తీసుకురావడం కోసం తమ్ముడు ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం, దానిని ఒక తెగతో ముడి పెట్టడం.. ఆలోచన వరకు బాగానే ఉంది. కానీ, దానిని తెరమీదకు ఆసక్తికరంగా తీసుకురాలేకపోయారు. అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలు సరిగా పండలేదు. ఏదో సినిమా నడుస్తుంటుంది అంతే. ఆ కథతో కానీ, అందులోని పాత్రలతో కానీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాని విధంగా.. గందరగోళంగా కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల వల్ల నిడివి పెరగడం తప్ప కథకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా అయినప్పటికీ ఇందులో వావ్ మూమెంట్స్ పెద్దగా లేవు. ఫస్ట్ హాఫ్ కాస్త పరవాలేదు కానీ, సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశచెందే అవకాశముంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో విజయ్ పతాక సన్నివేశాల్లో తప్ప.. మిగతా అంతా ఒక సాధారణ పాత్రలా అక్కడక్కడా మెరుస్తాడు.  అసలు ఈ కథను ఒకే భాగంగా తెరకెక్కిస్తే.. అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది అనిపిస్తుంది. క్లైమాక్స్ ను ఇంటర్వెల్ లా చూపించి, రెండో భాగంలో చెప్పాలనుకున్న కథను సెకండ్ హాఫ్ లో చెప్పి ఉండాల్సింది. అప్పుడు అనవసరమైన సీన్స్ పోయి.. స్క్రీన్ ప్లే టైట్ గా ఉండేది. ఏది ఏమైనా కథకుడిగా గౌతమ్ తిన్ననూరి బాగా నిరాశపరిచాడని చెప్పవచ్చు.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: సూరి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కొత్త విజయ్ కనిపించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో విజయ్ నటన ఆకట్టుకుంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన మధు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో పరవాలేదు అనిపించుకుంది. సూరి అన్నయ్య శివ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక మురుగన్ గా వెంకటేష్ ఆకట్టుకున్నాడు. అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కింగ్‌డమ్ మూవీ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కెమెరా పనితనం టాప్ క్లాస్ లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాత్రం ఈసారి పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. పాటలు జస్ట్ ఓకే. నేపథ్య సంగీతంలో కూడా పూర్తిస్థాయిలో తన మార్క్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తన ప్రతిభ కనిపించింది. సినిమా నేపథ్యానికి, కథ జరిగిన కాలానికి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన వర్క్ ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.    ప్లస్ పాయింట్స్: - విజయ్, సత్యదేవ్ నటన - నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్: - కథనం  - భావోద్వేగాలు    ఫైనల్ గా.. సినిమా అనేది ఒక సామ్రాజ్యం అయితే.. దానిని నిలబెట్టేది రచనే. కానీ, కింగ్‌డమ్ విషయంలో ఆ రచనే తేలిపోయింది. విజయ్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువే.   రేటింగ్: 2/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Organisation recommends viewers' discretion before reacting to this opinionated take.  
భారతీయ చిత్ర పరిశ్రమలో అపర కర్ణుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్‌. గత కొన్నేళ్లుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న సోనూ ఇప్పుడు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. జూలై 30 తన పుట్టిన రోజు సందర్భంగా వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. 52వ ఏట అడుగుపెట్టిన సోనూ.. 500 మంది వృద్ధులకు ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఆశ్రమంలో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు వైద్య సహాయం, పోషకారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వయసులో వారికి ఎమోషనల్‌గా సపోర్ట్‌ అందించే విధంగా ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. సినిమాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించే సోనూ.. నిజ జీవితంలో ఎంతటి మానతావాది అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఆయన చేసిన సేవలకుగాను ఇటీవల జరిగిన మిస్‌ వరల్డ్‌ 2025లో ప్రతిష్ఠాత్మక మానవతావాది పురస్కారాన్ని అందుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సోనూ చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేదు. వలస కూలీలను తన సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి దగ్గరుండి వారిని సొంత ఊళ్ళకు పంపించడం, తన హోటల్‌ మొత్తాన్ని కరోనా బాధితులకు కేటాయించడం.. వంటి మంచి పనులు ఆయన్ని రియల్‌ హీరోని చేశాయి. ఆయన సేవా కార్యక్రమాలు అక్కడితో ఆగలేదు. సోషల్‌ మీడియాలో తన వరకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ.. సాయం కోరిన వారిని ఆదుకుంటూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు సోనూ సూద్‌. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతికి ఇప్పటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. జీవితంలో పురోగతి, విజయం సాధించాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీరు కూడా జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనుకుంటే, వీటిని పాటించండి. ఆ నియమాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. మీ సమస్యలను మీలోనే ఉంచుకోండి: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తన జీవితంలో పురోగతి సాధించాలని, డబ్బు సంపాదించాలని కోరుకునే వ్యక్తి తన సమస్యలను లేదా బాధలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. మీరు మీ సమస్యలను ఇతరులతో పంచుకున్నప్పుడు, వారు దానిని మరింత తీవ్రతరం చేయవచ్చు. జ్ఞానుల సమాజం: చాణక్యుడి ప్రకారం, మనం పురోగతి సాధించాలంటే లేదా విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, మనం మొదట జ్ఞానులతో సహవాసం చేయాలి. మీరు అజ్ఞానులతో లేదా మూర్ఖులతో ఎప్పుడూ సహవాసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేయడం ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకునే బదులు కోల్పోతారు. వారిని నమ్మవద్దు: చాణక్య నీతి ప్రకారం, ఇతరులను విశ్వసించే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిది కాకుండా వేరే ప్రపంచంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు లేదా సరిగ్గా వినకుండా మిమ్మల్ని పట్టించుకోకండి. అలాంటి వారు మీరు చెప్పినదానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సగం మనస్ఫూర్తిగా వినడం ద్వారా, ఇతరులకు వేరే విధంగా చెప్పడం ద్వారా మీకు సమస్యలను కలిగించవచ్చు. ఎక్కువ నిరీక్షణ, అనుబంధం వద్దు: ఇతరులపై మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదని చాణక్య నీతిలో పేర్కొన్నారు.  ఓవర్ అటాచ్మెంట్ కూడా తప్పు. సంబంధాలు ఎప్పుడు అర్థాన్ని కోల్పోతాయో చెప్పడం కష్టం. ఈ సమయంలో మంచి సంబంధం మరొక క్షణంలో దాని అర్ధాన్ని కోల్పోవచ్చు. ఖర్చుపై పరిమితులు ఉండాలి: సంపాదించిన డబ్బును కూడబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు మీ ఆదాయానికి సమానంగా లేదా మించకూడదు. ఎడిటింగ్ ఎల్లప్పుడూ సరైన మార్గంలో మాత్రమే చేయాలి.  
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా ఈ కాలంలో మంచి ఉద్యోగాలు, బోలెడు వసతులు, కావలసినంత సంపాదన ఉన్నా ఆరోగ్యమే సరిగ్గా ఉండటం లేదు. పుట్టడంతోనే జబ్బులతో పుట్టేస్తున్నారు పిల్లలు. పెరిగే వయసులో తగినంత శారీరక ఎదుగుదలకు సహకరించే ఆటలకు దూరం ఉండి ఎప్పుడూ పుస్తకాలతో ఉండటం వల్ల శారీరకపరంగా దృఢంగా ఉండలేకవుతున్నారు. ఇక ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు సంసారం ఇదంతా గడుస్తూ ఉంటే వాటితో సతమతం అవ్వడం తప్ప ఆరోగ్యం అనే ఆప్షన్ గురించి సీరియస్ గా తీసుకోలేరు. పైపెచ్చు ఏదైనా జబ్బులొస్తే టెంపరరీగా నయమయ్యేందుకు మెడిసిన్స్ వాడి హమ్మయ్య అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనారోగ్యమే. డబ్బు పెట్టినా కూడా పూర్తిగా కోలుకోలేని విధంగా తయారైపోతున్నారు. అలాంటి అనారోగ్యాలు ఉండకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట సంతోషంగా వుండాలి....  సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు పెద్దగా ప్రభావం చూపించవు. అలాగని లేని సంతోషాన్ని ఎలా మనం తెచ్చిపెట్టుకోవడం అనిపిస్తుందేమో కానీ సంతోషం అంటే ఉన్నదనితో తృప్తిగా ఉండటం అలాగే పరిష్కరించలేని సమస్యల విషయంలో అనవసరంగా ఆలోచించి బాధపడి లాభంలేదు. పరిష్కరించ గలిగిన సమస్యల గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే పరిష్కరించలేము అని తెలిసాక కేవలం రోజువారీ పనులు చేసుకుంటూ పోవడమే, ఇక పరిష్కారం అవుతాయి అని తెలిసిన పనుల గురించి అసలు ఆలోచనే అవసరం లేదు కదా. ఆహార మార్గం! శారీరకంగా మనిషి బాగుండాలి. శరీరంలో ఏర్పడే అసమతుల్యత చాలా సమస్యలకు దారితీస్తుంది. అందుకే మంచి ఆహారం ఎంతో ముఖ్యం. కేవలం ఆహారం తీసుకుంటూ ఉంటే సరిపోదు.తినే ఆహారానికి తగినంత వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. వ్యాయామం మనిషిలో ఉల్లాసాన్ని పెంచుతుంది. మంచి ఆహారం తీసుకుంటూ కనీసం గంట సేపు వ్యాయామం చేస్తూ వుంటే ఆరోగ్యం బావుంటుంది. బాడ్ హబిట్స్ బంద్! చెడు అలవాట్లు శరీరాన్ని కుళ్ళబొడుస్తాయి. ఏ రకమైన చెడు అలవాట్లను దగ్గరకు రానీయకండి. చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని ఇతర అలవాట్లను ( తినకుడాని ఆహార పదార్థాలు అతిగా తినడం, టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం, సోమరితనంగా ఉండటం. కష్టపడే అవసరం లేదని ఎలాంటి ఉద్యోగాలు చేయకపోవడం. ఇవన్నీ కూడా నిజానికి బాడ్ హాబిట్స్ ఏ)  నిజానికి పొగ త్రాగడం కాని, ఆల్కహాలు కాని, జూదం కాని మనకు హాయిని ప్రశాంతతను ఇవ్వలేవు. ప్రతి మనిషికి ఒక వ్యాపకం అంటూ ఉండాలి.  రీడింగ్ ఈజ్ ఏ వండర్! మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలలో కావలసినంత విజ్ఞానం లభిస్తుంది. ఎంతోమంది జీవితాలు, ఆ జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలు, వాటిని ఎలా డీల్ చేయాలి, గొప్ప ఆలోచనలు ఎలా ఉంటయి?? జీవితం ఉన్నతంగా ఉండటం అంటే ఏమిటి?? ఆర్థిక, మానసిక సమస్యలు, మనుషుల మధ్య అటాచ్మెంట్స్ వంటివి అన్నీ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు.  అదొక అద్భుత ప్రపంచం అవుతుంది.  మెడిసిన్ లెస్ లైఫ్! ఎన్ని సార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన మాట సాధ్యమైనంత వరకు ఔషధాల వాడకం తగ్గించాలి.  శరీరానికి ఆహారపదార్థాల ద్వారానే జబ్బును నయం చేసుకునే మార్గాన్ని తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సీజనల్ వారిగా దొరికే ఆహారం అమృతంతో సమానంగా పనిచేస్తుంది. రుచి కోసమో, సీజన్ దాటి దొరుకుతున్నాయనే ఆశతోనో వేటినీ తీసుకోవద్దు. కుదిరితే ఇంటి ముందు నాలుగు రకాల ఆకుకురా మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు అప్పుడు రసాయనాలు లేని ఆహారం మీ ముందున్నట్టే. బాగా అవసరమైనప్పుడు మాత్రమే మందులను అల్లో చేయాలి.  ప్రశాంతత! ప్రస్తుతం అందరి సమస్య ఒకటే ప్రశాంతత లేకపోవడం. దానివల్లనే ఎన్నోరకాల మానసిక సమస్యలు చుట్టుముడతాయి.  మనసు ప్రశాంతంగా వుంటే చక్కటి నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసును బయట ప్రపంచం నుండి వెనక్కి లాక్కొచ్చి ఒక్కచోట ఉంచుకోవాలి. అదే ధ్యానం చేసే పని. అలా చేస్తుంటే చక్కటి నిద్ర సొంతమవుతుంది.  చక్కటి నిద్ర మాత్రమే మంచి ఆరోగ్యానికి చిహ్నం. ఎక్కువగా పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో మానసికంగా, శారీరకంగా కష్టపెట్టుకోవద్దు. ఇవన్నీ పాటిస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.                                 ◆వెంకటేష్ పువ్వాడ
అంతా నువ్వే చేసావు. అప్పుడలా చేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అన్నిటికి కారణం మీరే. ఇప్పుడు జీవితంలో సొల్యూషన్ ఏంటి?? జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు భరించేవాళ్ళు?? మీకేం హాయిగానే ఉంటారు, భరిస్తున్న వాళ్లకు తెలుస్తుంది అందులో ఉన్న బాధ. ఇలాంటి మాటలు చాలా మంది తమ జీవితాల్లో మాట్లాడుతూ ఉంటారు. వీటికి కారణం ఏమిటంటే ముఖ్యమైన నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేక ఇతరుల ఒత్తిడితోనో, లేక నిస్సహాయతలోనో ఉన్నప్పుడు జరిగిపోవడం. సింఫుల్ గా చెప్పాలి అంటే జీవితాన్ని, అందులో ముఖ్యమైన విషయాలను ఇతరులు నిర్ణయించడం.  ఎందుకిలా? జీవితాల్లో ఇలా ఎందుకు జరుగుతాయి. సాధారణంగా చాలామంది చెప్పుకునే సమర్థింపు కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే అలా రాసిపెట్టి ఉంది. దానికి ఎవరేం చేయగలరు అని. అదే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా అటు ఇటు అయితే అందరూ అలాగే అనుకోగలరా?? లేదే ముందే చెప్పాము కానీ వినలేదు. అందుకే ఇలా అవుతోంది. కావాల్సిందేలే. శాస్తి జరగాల్సిందే లాంటి మాటలు వినబడుతుంటాయి.  అయితే వాటి గురించి పక్కనబెడితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అని.  అంతిమ నిర్ణయం! ఎవరు ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు, ఎన్నో సలహాలు అయినా తీసుకోవచ్చు. కానీ చివరికి సాధ్యా సాధ్యాలు ఆలోచించి నష్టాలు జరిగితే భరించాల్సింది నేనే కదా అనే అవగాహనతో ఉండాలి. అపుడే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు.  ఇచ్చేయ్యాలి! ఎవరి జీవితంలో వాళ్ళు తమ సామర్త్యాలకు తగినట్టు ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉంటారు. ఒక మెడికో దగ్గరకు వెళ్లి పోలీస్ అకాడమీ కి సంబంధించిన విషయాలు చెప్పమంటే ఎలా అయితే అవగాహన లేకుండా ఉంటారో ఇదీ అంతే.  ఇంకొక విషయం ఏమిటంటే పెద్దరికం అనే ఆయుధం చేతిలో ఉంది కదా అని ఊరికే చిన్న వాళ్ళ జీవితాలను డిసైడ్ చేయకూడదు.  కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలి. అలాగని వాళ్ళ జీవితాలను ఏదో వీధుల్లో వదిలేయడం లేదు కదా. పెద్దరికం అంటే తప్పు మార్గం లో వెళ్తున్నప్పుడు రంగంలోకి దిగి సరిచెయ్యడం, చెప్పాల్సిన రీతిలో చెప్పడమే కానీ జీవితాలను లాక్కోవడం కాదు. బి కాన్ఫిడెంట్! కాన్ఫిడెంట్ అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఉంది అని నోటితో చెబితే వచ్చేది కాదు. నలుగురితో చెబితే బుర్రలో చేరేది అంతకన్నా కాదు. అనుభవాలు, పరిస్థితులను మేనేజ్ చేయడంతో ఆ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ప్రణాళిక, లక్ష్యాలు చేరడం అనేవి చాలా ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత వాటి నష్టాలు ఏమైనా ఎదురైనా తిరిగి భర్తీ చేసుకోవడం చాలా కష్టం. అతి విశ్వాసం వద్దు! కొందరు చెప్పేవాటిలో  మంచి విషయాలే ఉండచ్చు.  అయితే వాళ్ళ వరకు మాత్రమే అది మంచిగా ఉండచ్చు. కానీ ఇతరులకు అలా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు. అలాంటప్పుడు నాకేదో బాగుంది మీకూ బాగుంటుందిలే carry on అని అదేపనిగా ముందుకు ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు.  ఇదే నిజం! పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు,ఉద్యోగాలు కావచ్చు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉండచ్చు. ప్రతి నిర్ణయంలో అంతిమంగా తృప్తి అనేది ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ పని చేసాక ఏదైనా నష్టం జరిగినా నేను దాన్ని భరించగలను అనే ఆలోచన కూడా ఉండాలి. ఫెయిల్యూర్ ను ఆక్సిప్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి. అలా ఉంటే జీవితాలు బాగుంటాయి. లేకపోతే గడ్డి తినమన్నారు కాబట్టి తిన్నాము ఇప్పుడు అరగలేదు అంటే దానికి ఎవరు బాద్యులు?? ఎంత అనుభావాలు కలిగిన  వాళ్ళు అయినా అవి వాళ్ళ వరకు మాత్రమే 100% వర్తిస్తాయి.  అందుకే నిర్ణయాలు నవ్వుతాయి. జాగ్రత్తగా ఒకరి ప్రమేయం లేకుండా వాటిని తీసుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ.
  చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే.. విటమిన్ల పాత్ర.. శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ సి లోపం.. విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంటి చికిత్సలు.. ఐస్ కంప్రెస్.. నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ మసాజ్..  అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  రోగనిరోధక వ్యవస్థను శరీరానికి కవచం అని పిలుస్తారు. ఇది అనేక రకాల అంటు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యలను అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ దిశలో నిరంతరం ప్రయత్నించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికోసం ఆహారం,  జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం  చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో  విటమిన్-సి,  డి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్లు ఆహారాలను బాగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అంటారు. అయితే..  రోగనిరోధక వ్యవస్థకు ఈ రెండు మాత్రమే సరిపోవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడే రోగనిరోధక వ్యవస్థను  ఎలా బలోపేతం చేయవచ్చో తెలుసుకుంటే.. విటమిన్ సి-డి  ప్రయోజనాలు.. విటమిన్ సి అనేది బయోసింథటిక్, జన్యు నియంత్రణ ఎంజైమ్‌లకు అవసరమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది తెల్ల రక్త కణాలు వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా, విటమిన్ (డి3) రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఉదయం 10-15 నిమిషాలు ఎండలో ఉండటం ద్వారా లేదా విటమిన్-డి  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ డి పొందవచ్చని,  రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఇ కూడా అవసరం.. విటమిన్లు సి,  డి లాగానే, విటమిన్ ఇ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్  శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన 200 జీవరసాయన ప్రతిచర్యలలో భాగం. జుట్టు,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా దీనిని తీసుకునేలా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా ముఖ్యం.. ప్రోటీన్.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాత్ర పోషిస్తున్న అమైనో ఆమ్లాలతో రూపొందించబడింది. ఈ సమ్మేళనాలు  రోగనిరోధక వ్యవస్థ కీలకమైన T కణాలు, B కణాలు,  సూక్ష్మక్రిములతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లేని వ్యక్తులు బలహీనమైన కండరాలను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల కంటే అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో జింక్ ఉందా? బలమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే తెల్ల రక్త కణాలలో ఒక ముఖ్యమైన భాగం. జింక్ లోపం తరచుగా  ఫ్లూ, జలుబు,  ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తారు. జింక్‌ను ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు.                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  అది శరీర నిర్మాణం అయినా లేదా బరువు తగ్గడం అయినా ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్ ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఎక్కువ ప్రోటీన్ అందరికీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి అధిక ప్రోటీన్ ఆహారం  ధోరణి పెరిగినంతగా, దానితో వల్ల ఏర్పడే   దుష్ప్రభావాలు  ప్రమాదాల గురించి పెద్దగా చర్చ కనిపించదు.  అధిక ప్రోటీన్ ఆహారం అంటే  ఒక రోజులో తీసుకునే కేలరీలలో 25% నుండి 35% ప్రోటీన్ నుండి వస్తుంది. ఇందులో గుడ్లు, చికెన్, చేపలు, జున్ను, పప్పులు, ప్రోటీన్ పౌడర్ మొదలైనవి ఉంటాయి. దీని వల్ల  కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గుతుంది. కానీ అది అందరికీ ప్రయోజనకరంగా ఉండదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు హానికరం. కండరాలను నిర్మించడానికి,  ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం, కానీ కొన్ని వ్యాధులలో అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే.. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి అధిక ప్రోటీన్ ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఊక పిండి, మొక్కజొన్న, బేకరీ ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. దీనితో పాటు, మినపప్పు, మాంసం, చేపలు, బీన్స్, మునగకాయ, పాలకూర, బఠానీలు, పుట్టగొడుగులు, బీట్‌రూట్, గుమ్మడికాయ గింజలు తినకూడదు. వైద్యుడి సలహా మేరకు  తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు.. అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలను కష్టతరం చేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఇది ప్రమాదం.  దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వారి ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలి.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత  చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు, తృణధాన్యాలు,  సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగడ,  జీర్ణ సమస్యలు, మూత్రపిండాల ఒత్తిడి,  శరీరం డీహైడ్రేషన్ కు లోనుకావడం జరుగుతుంది. అందువల్ల,  ఆహారాన్ని మార్చుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాలి. అధిక ప్రోటీన్ ఆహారం చాలా మంచిది అని అనుకుంటారు.. కానీ  ప్రతి శరీరానికి,  ప్రతి పరిస్థితికి ఇది సరైనది కాదు. బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి,  అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. అన్నింటికంటే బెస్ట్ ఏదంటే..  సమతుల్య ఆహారం.  దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్,  సూక్ష్మపోషకాలు అన్నీ సరైన మొత్తంలో ఉంటాయి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..