వైసీపీ వారి వూహించిన మలుపుల చిత్రం 'ఆ ముగ్గురు'!

Publish Date:Jun 12, 2022

Advertisement

నలుగురితో ఎప్పుడూ బాగుండాలి, అందరినీ సమానంగా చూడాలి, మంచివాళ్లని అనిపించుకోవాలి. మంచిగా ప్రవర్తించాలి.. ఇవి అనాదిగా పెద్దవాళ్లు చెబుతున్న సూక్తులు. విని వాటి సారాంశం ఆకళింపు చేసుకోవాలి. లేకుంటే అప్రతిష్ట పాలవడం ఖాయం. ఇపుడు జగన్‌ సర్కార్‌ది ఇదే పరిస్థితి. కొన్ని విషయాలు పరిశీలించి పట్టించుకోవాలి. ఈ రెండూ నిర్లక్ష్యం చేసి సమస్యలు కొని తెచ్చుకున్న నేత వైసీపి అధినేత జగన్‌ రెడ్డి. అధికారంలోకి రావాలని తాపత్రయపడి, తీరా వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పార్టీ వర్గాల్లో సమస్యలు తలెత్తకా పోవు, క్రమేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకూ ప్రాణం విసిగెత్తకా పోదు. మరి అదే జరిగింది. మూడేళ్ల పాలన తర్వాత తరచి చూసుకుంటే పార్టీ వర్గాల్లో సఖ్యతా లోపం, నాయకుని మాటకే విలువ లేకపోవడం, జంపింగ్‌ జిలానీలుగా మారడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం. అన్నీ జరిగిపోతున్నాయి.

ఏపీలో ముగ్గురు ఎంపీలు వైసీపిలో ఏమాత్రం కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదన్నది తేట తెల్లమయింది. వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో నిత్యం చిన్నపిల్లల్లా గొడవలు పడుతున్నారు. వారి మధ్య ఏమాత్రం స్నేహపూర్వక వాతావరణం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కుకునే స్థాయి క్రమేపీ కోల్పోతోంది. మూడేళ్లలో ఎన్నికలు జరగనుండగా పార్టీలోని సీనియర్లలోనూ ప్రశాంతత కరువయింది. దీనికి తోడు వచ్చే ఎన్నికలకు పొత్తులకు అవకాశం వుందని తెలుగు దేశం అనడంతో వైసీపీ ఎంపీలు కొంత ఆకర్షితులయ్యారనే చెప్పాలి.

ఉత్తరాంధ్రలో నరసాపురం నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కనిపించరు. ఇప్పుడు కాదు రెండేళ్లుగా అసలు నియోజకవర్గానికే ఆయన దూరంగా వున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతునిస్తుండటం గమనార్హం. ఆయనకు పార్టీ నాయకునికి మధ్య విభేదాలు ఆఖరికి ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారేవెూనన్న అనుమానాలకి దారితీస్తోంది. రెబెల్‌ స్టార్‌గా రాజకీయాల్లో ప్రసిద్ధి పొందడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలనుకున్నారు జగన్‌. కానీ ఆయనపై అనర్హత వేటు వేయడానికి సాంకేతిక ఇబ్బందులు అడ్డు పడ్డాయి. పార్టీలో వున్నట్టేనా అంటే వున్నట్టే, మీవాడేగా అంటే మావాడే కాని కాడు.. అనే రీతిలో రెండేళ్లుగా వైసీపీలో రఘురామరాజు ప్రయాణం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపీ టికెట్‌ మీదనే తన నరసాపురం నియోజకవర్గం నుంచే పోటీచేసినా పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు.

నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వారి ఎంపీ లావు కృష్ణదేవరాయలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. పాపం ఆయన మాత్రం అందరితో కలిసి పనిచేయాలన్న మనసున్న వ్యక్తే. ఎమ్మెల్యేలే ఆయన్ను దూరంగా పెట్టేరు. మరీ ముఖ్యంగా విడదల రజని(చిలకలూరిపేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ)తో ఆయనకు తరచూ ఏదో విధంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటీ అంటనట్టే వ్యవహరిస్తున్నారు. అంతెందుకు ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు, నరసరావు పేటలో జరిగిన బహిరంగ సభకు ఎంపీ లావు దూరంగానే వున్నారు. పార్టీ అధిష్టానానికి ఎంత గోడు పెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం పూరించినట్టే అయింది. విసిగెత్తింది. మనసు విరిగింది. పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరందుకుంది. మారినా ఆశ్చర్యపడగనక్కర్లేదు.

ఇక ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయానికి వస్తే, అసలు ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగానే వున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదనే ఆయన వైసీపీలోకి వచ్చేరు. ఇక్కడ ఆయనకు లాభం కంటే నష్టమే జరిగిందన్న భావనతో కుంగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా పేరున్న తమ మ్యాకడోవెల్స్‌ వైన్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం మీద కాస్తంత కినుక వహించేరు. పక్క రాస్ట్రాలు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందిపెట్టడం లేదన్న అభిప్రాయం నాటుకుంది. దీనికి తోడు స్థానికంగా బాలినేని ఆధిపత్యం చలాయిం చడం పెరిగింది. దీంతో తనకు అంతకు ముందున్న పట్టు పోయిందని ఇబ్బందిపడుతున్నట్టు అనుచరులే అంటు న్నారు. ప్రోటోకాల్‌ సమస్య ఇంతగా ఇబ్బందిపెడుతుందా, ఏవెూగానీ మాగుంట మాత్రం వచ్చే ఎన్నికల సమ యానికి పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా వున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
మూడేళ్లకే డీలాపడ్డ జగన్‌ని వచ్చే ఎన్నికల నాటికి ఎవరు, ఎలా ధైర్యం ఇచ్చి నిలబెట్టగలరు స్వపార్టీవారే పక్క చూపులు చూస్తుంటే పార్టీ అధినేత  చేసేదేముంటుంది. వచ్చే ఎన్నికల సమయానికి టిడిపి పంచన చేరేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందన్నది పరిశీలకుల మాట. అదెలా వున్నా, తాను వూహించనది జరిగి తీరాలన్న పట్టుదల, తన మాటే వినాలన్న మొండితనమే వైసీపీ కోటను బద్దలుకొట్టగలదు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.