అప్పుడు సరే మరి ఇప్పుడైనా..?

Publish Date:Jun 12, 2022

Advertisement

సరే.. అప్పుడు జరిగి పోయిందేదో జరిగిపోయింది. ఆధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ కేంద్రంలో బీజేపీ/ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆ విధంగా, కేంద్రం మెడలు వంచే అవకాశం వైసేపీకి, ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. రాష్ట్రంలో వైసీపీ బంపర్ మెజారిటీ (151/175) అధికారంలోకి వచ్చినా, 25కు22 ఎంపీ సీట్లు వైసీపీకే వచ్చినా విభజన హామీలు అమలుకు కేంద్రాన్ని అడిగేందుకే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నోరు పెగల్లేదు. ప్రత్యేక హోదా, సహా విభజన చట్టంలోని ఇతర హామీల అమలుకు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తేలేక పోయారు. అప్పుడప్పుడు ఓ రిక్వెస్ట్ చేయడమే కానీ, గట్టిగా ప్రధాని  మోడీ మెడలు వంచే అవకాశం జగన్ రెడ్డికి లేకుండా పోయింది. అందుకే గడచిన మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, మోడీ పాదాలే కానీ, మెడ వైపు చూడలేదు.
సరే ..అయిపోయిందేదో అయిపోయింది ... ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ అవసరం ఏర్పడింది. వైసీపీ, బిజూ జనతాదళ్ దయ తలిస్తేనే, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచి, గుర్రం బగ్గీలో రాష్ట్రపతి భవన్’ చేరుకుంటారు. బిజూ జనతాదళ్  ఏమి చేస్తుంది, ఏమి చేయదు అనే విషయం పక్కన పెడితే, వైసీపీ ఏమి చేస్తుంది? మోడీ మెడలు వంచుతుందా? మాకిది ఇస్తేనే, మీకు మా ఓటు ఇస్తాం అని గట్టిగా చెప్పగలుగుతుందా? క్విడ్ ప్రో క్వో’పద్దతిలో బేరమాడ గలదా? విభజన హామీల అమలుకు పట్టు పడుతుందా? లేక ఎప్పటిలా, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుందా? జీ .. హుజూర్ అంటుందా? అడగక ముందే, మామోటు మీకే ..అంటూ వైసీపీ  నేతలు కేంద్ర నాయకుల ముందు సాగిల పడతారా?   ఇదే, ఇప్పడు.,ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకిస్తోంది. రాజకీయ మెఇఅ వర్గాల్లో హాట్ హాట్’గా చర్చ జరుగుతోంది.   

నిజానికి, ఒక్క వైసీపీనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్టా, టీడీపీకూడా వైసీపీతో కలిసి కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తే, కేంద్రానికి మరింత గట్టి సెగ తగులుతుంది. దాంతో  ముగిసిన అధ్యాయం అంటూ మూలకు తోసిన ప్రత్యేక హోదా ఫైల్ మళ్ళీ తెరుచుకునన్నా తెరుచు కుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజీలో ఎపీకి గట్టి బలమే వుంది. రెండు పార్టీలకు కలిపి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వీరందరికీ రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కుంది. జనాభా ప్రాతిపదికన లెక్కిస్తే మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 అయితే, 36 మంది ఎంపీల ఓటు విలువ మొత్తం  25,488.. ఆవిధంగా ఆంధ్ర ప్రదేశ్  ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 27,825 + 25,488 = 53,313. ఇదేమి తక్కువ అంకె కాదు. రాష్ట్రపతి ఫలితాలను తారు మారు చేయగల సత్తా, ఏపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉందని గణాంకాలే కాదు, రాజకీయ విశ్లేషణలు  కూడా సూచిస్తున్నాయి. నిజానికి బీజేపే గెలుగ్పు ఓటములను నిర్ణయించే సత్తా ఏపీ ఒతుకుందని అంటున్నారు. 

అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత సాహసం చేస్తారా... కేంద్రంతో  క్విడ్ ప్రో క్వో’ గేమ్ ఆడతారా? అంటే , నో ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు.. నిజానికి, రాష్ట ప్రయోజనాలే కీలకం అనుకుంటే, కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ఇంకా చాలా మార్గాలున్నాయి. పార్లమెంట్’ దిగువ సభలో 22, ఎగువ సభలో 9 మంది వైసీపీ ఎంపీ లున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని  నిలదీయ దలచుకుంటే, ఈ సంఖ్య సరి పోతుంది.

అయినా ఈ మడు సంవత్సరాలలో ఎప్పుడూ ఆ ప్రయత్నం జరగ లేదు, పైగా వివాదస్పద బిల్లులు సభ ఆమోదంకోసం అవసరం అయిన ప్రతి సందర్భంలోనో కేంద్రానికి వైసీపీ అందగానే ఉంటూ వచ్చింది. అలాగే, ఇప్పడు అందివచ్చిన సువర్ణ అవకాశం కూడా జరవిడుచుకుంటే, ఏపీ ప్రజలు ఎప్పటికీ, వైసీపీని క్షమించరు.అంతకంటే ముఖ్యంగా ఎనిమిదేళ్ళుగా అన్యాయం వెంట అన్యాయానికి గురవుతున్న ఏపీ ప్రజలకు ఇంకో అన్యాయం తోడవుతుందని, అంటున్నారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.