కరోనా అనంతర సమస్యలతో ఆసుపత్రిలో సోనియా.. రేపు ఈడీ ఎదుట రాహుల్ హాజరు

Publish Date:Jun 12, 2022

Advertisement

కాంగ్రెస్ అధినేదత్రి సోనియాగాంధీ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకిన సంగతి విదితమే. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కరోనా అనంతర సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె ఆదివారం ఆసుపత్రిలో చేరారు. గంగారాం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జేవాలా ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోనియా గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా సోకి ఐసోలేషన్ లో ఉండటంతో ఆమెకు ఈడీ కొంత సమయం ఇచ్చి జూన్ 23న విచారణకు రావాలని మరోమారు సమన్లు పంపింది. ఆమె కుమారుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ఆ సమన్ల మేరకు ఈ నెల 2న ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే విదేశాలలో ఉన్న కారణంగా ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు.దీంతో ఈ నెల 13న హాజరు కావాలని ఈడీ ఆయనకు మరో మారు సమన్లు పంపింది. దీంతో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఆయన రేపు అంటే 13న ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా సోనియా గాంధీ కూడా ఈడీ ఎదుట హాజరై తీరుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ హెరాల్డ్ కేసులో తమ పార్టీ నేతలకు సమన్లు జారీ చేసిందని ఆయన ఆరోపించారు.  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును రాజకేయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదలా ఉంటే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ  అనారోగ్యం కారణంగా, 8వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కాలేదు. నిజానికి పక్షం రోజుల క్రితమే, జూన్ 8 న విచారణకు హాజరు కావాలని, ఈడీ ఆమెకు సమన్లు జారీచేసింది. అయితే, ఇటీవల ఆమెకు  కరోనా సోకినా నేపధ్యంలో విచారణకు మూడు వారాలు గడవు కోరారని, కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా అనంతర సమస్యలతో గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవంక ఇదే కేసులో, సమన్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూడా విదేశాలలో ఉన్న కారణంగా, జూన్ 2 న విచారణకు హాజరు కాలేదు. అయితే అయన అభ్యర్ధన మేరకు ఈడీ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. మరో వంక ఇదే కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరోవంక  నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణల జుగల్ బందీ నడుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయదాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నేషనల్ హెరాల్ద్ కేసు విషయంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా పేర్కొన్నారు.

బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా?   అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయందే నిజం అయితే ఆ ఇద్దరూ  విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.  ఇదలా ఉంటే కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరో వంక  ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ హజరయ్యే రోజు.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్‌. సోనియా, రాహుల్‌ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై పార్టీ సినియర్‌ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. గురువారంవర్చువల్‌గా జరిగిన భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు   ఏఐసీసీ ఆదేశాలమేరకు హాజరయ్యారు.

సో.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు రాజకీయ మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే, న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాన్ని వీధుల్లోకి తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందా లేక అది కూడా బూమరాంగ్ అవుతుందా అనే విషయంలో  కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.