మోసగాళ్లకి మోసగాడు.. కేటుగాడు ఈ వైసీపీ నాయకుడు..
Publish Date:Feb 14, 2022
Advertisement
ఈ ఫోటో ఓసారి చూడండి. చూడగానే చెప్పేయొచ్చు అతను వైసీపీ నాయకుడని. సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలతో సహా చాలామంది అధికారపార్టీ నేతలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఈ ఫోటోలు చూస్తుంటే తెలిసిపోతోంది. వంద శాతం వైసీపీ నేతైన ఇతను.. తన పరపతి ఉపయోగించి.. ప్రజలను వంద శాతం మోసం చేస్తున్నాడని ఫిర్యాదు అందింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లకు కోట్లు వసూలు చేశాడు. ఉద్యోగం ఏమైందని అడిగితే.. చంపుతానని బెదిరిస్తున్నాడు. గతంలోనూ ఇతనిపై ఆరోపణలు రాగా.. లేటెస్ట్‌గా మరో బాధితుడు కేసు పెట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ఫోటోలో ఉన్నతను విజయవాడ పొరంకికి చెందిన వైసీపీ నాయకుడు మహీధర్. తాజాగా ఇతనిపై సీఎం క్యాంపు కార్యాలయంలోని స్పందనలో ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని.. విజయవాడకు చెందిన కళ్యాణ్ నుంచి 13 లక్షల 50 వేలు వసూలు చేశాడట మహీధర్. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో.. విసుగు చెందిన కల్యాణ్ తన డబ్బులు తనకు ఇచ్చేయమని అడిగాడు. ఇక అంతే. తాను వైసీపీ నాయకుడని, తనకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయంటూ.. ఈ ఫోటోలు చూపిస్తూ.. తనను ఎవరూ ఏం చేయలేరంటూ.. డబ్బులు అడిగితే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఓ మాజీ ఎంపీ తనకు బావని, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే తనకు అన్నని చెబుతూ.. బాధితుడిని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన కల్యాణ్ నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేశాడు. మహీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆరా తీస్తే.. బెజవాడ వైసీపీ నాయకుడైన మహీధర్ మామూలోడు కాదని తేలింది. గతంలోనూ ఇలానే భారీ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ మధ్య బ్రేక్ ఇన్‌స్పెక్టర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. వైసీపీ పెద్దల పేర్లు చెప్పి.. పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి వారందరినీ మహీధర్ మోసం చేసిన క్రిమినల్ చరిత్ర మహీధర్‌ది. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనూ మహీధర్‌పై కొందరు బాధితులు ఫిర్యాదులు చేశారు. మహీధర్ చేతిలో మోసానికి గురైన బాధితుల సంఖ్య ఏపీ వ్యాప్తంగా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. తాజా, కంప్లైంట్‌తో మరోసారి మహీధర్ విషయం వెలుగులోకి వచ్చింది. మరి, ఇంతా జరుగుతుంటే, అంత మందిని మోసం చేస్తుంటే.. మహీధర్‌పై పోలీసులు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వైసీపీ నాయకుడని వదిలేస్తున్నారా? ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారా? పార్టీ నేతలకూ వాటాలు అందుతున్నాయా? ఇలాంటి క్రిమినల్స్‌ని పార్టీలో ఎంకరేజ్ చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
http://www.teluguone.com/news/content/ycp-leader-jobs-cheating-in-ap-25-131771.html





