హోదా కాదు అప్పులే.. మోదీకి జగన్ లేఖలో ఉందిదే..
Publish Date:Feb 14, 2022
Advertisement
కేంద్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి, ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17 వ తేదీన కమిటీ తొలి సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 11) ఒక సర్కులర్, మీటింగ్ ఎజెండా రిలీజ్ చేసింది.అందులో ఉద్దేశం ఏదైనా, (పొరపాటునో, గ్రహపాటునో, లేక ఏపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దమనో) ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని కూడా చేర్చింది. ఆ వెంటనే కొద్ది గంటల్లోనే, తూచ్ ...తప్పయి పోయిందని, ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని, దానితో పాటుగా ఇంకో రెండు మూడు కమిటీ పరిధి లోకిరాని అంశాలను తీసి పక్కన పెట్టింది. అయితే ఈ ఊ.. ఊహూల మధ్య ఉన్న కొద్ది గంటల సమయంలోనే, పెద్ద సలహాదారు సజ్జల సహా వైసీపీ నాయకులు, మంత్రులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెరపైకి వచ్చి జగన్ హోదా సాధించేశారన్నట్లుగా ప్రచారం చేశారు. పనిలో పనిగా మంత్రి పదవి కోసం ఆల్ అవుట్ ఎఫర్ట్స్ పెట్టిన ఎమ్మెల్యే రోజా వంటి కొందరు ఇంకో అడుగు ముందుకేసి, చంద్రబాబుకు చేతకాలేదు మా జగన్ బాబు సాధించుకోచ్చారని, ముఖ్యమంత్రి దగ్గర మరో రెండు మార్కులు ఎక్కవ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనవరి (2022) ౩న ప్రధాని మోడీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారని, ప్రధానిని కలిసిన సందర్భంలోనూ గట్టిగా అడిగారని చెప్పు కొచ్చారు. అందుకే, ప్రధాని మోడీ మూసేసిన ఫైల్ మళ్ళీ తెరిచారని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే, తీరామోసి ఆ 14 పేజీల లేఖ (DO.Lr No5/CM-Secy.2022 దట్. 03.01,2022) లోని తొలి అక్షరం నుంచి చివరి సంతకం వరకు, ఒకటికి రెండు సార్లు చవినా, ఎక్కడా ఒక్క సారైనా, ఒక్క చోట అయినా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. ఆసలు ఆ పదమే లేదు. అయితే, సూది కోసం సోది కెళితే, పాత రంకులు బయట పడ్డాయి అన్న విధంగా, ఈ 14 పేజీల లేఖ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దివాలా కథల్లో మరో కథను మరో కథ బయట పడింది. అఫ్కోర్స్, ఇది ఆల్రెడీ సర్క్యులేషన్ ఉన్నదే, ఆయినా, ఇంతవరకు అబ్బే అదేమీ లేదు, అంతా టీడీపీ అసత్య ప్రచారం అంటూ బుకాయిస్తూ వచ్చిన జగన రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తేలు కుట్టిన దొంగల దొరికి పోయింది. ఇక విషయంలో వస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు ఇస్తమన్నా అప్పులు కూడా ఇవ్వడం లేదని , ఏదో ఒకటి చేసి, ఎస్బీఐ ఇస్తామని ఆశ పెట్టి ఆపేసిన రూ.1800కోట్ల రుణాన్ని వెంటనే విడుదల చేయించి రాష్ట్రన్ని ఆదుకోవాలనే అభ్యర్ధన , విన్నపం. వేడుకోలు లేక ఇంకేమనాలో అది మాత్రం ఉంది. అంతే కాదు, ఇలా బ్యాంకులు ముఖాన తలుపులు వేయడానికి,తమ నిర్వాకం, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం కారణమన్న నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకు, సొంత పార్టీ ఎంపీ ఎంపీ, రఘురామా కృష్ణం రాజును, ‘రోగ్’ ఎంపీని చేశారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో రాష్ట్రంలో అలుముకుని ఉన్న అమితమైన పేదరిక బాధలను శాశ్వతంగా నిర్మూలించే, ‘పవిత్ర’ ఆశయంతో, జాతీయ రహదారుల అధికార సంస్థ తరహాలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మండలి (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేసి, ఆసంస్థ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైనాన్ని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్హెచ్ఎఐ) తరహాలో, అంటే పకడ్బదీడగా చేస్తున్న అప్పులను వివరించారు. ఏపీఎస్డీసీ ద్వారా చేసిన అప్పులను తీర్చేందుకు,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం ‘మందు’ చూపుతో మద్యం అమ్మకాల మీద ప్రత్యేకంగా, ‘ఏఆర్ఈటీ’ పన్ను విధించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. అయితే, మా పార్టీకి చెందిన ఒక ‘రోగ్’ ఎంపీ, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ ఆధారంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ఏపీఎస్డీసీ’ రుణ సేకరణఫై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా, ప్రాధాన ప్రతిపక్షం టీడీపీతో కలిసి, రాజకీయ ప్రయోజనాల కోసం ‘రోగ్’ ఎంపీ చేసిన నిరాధార ఆరోపణలు ఆధారంగా, కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్టుమెంటును వివరణ కోరింది.అలాగే, ఏపీఎస్డీసీ (ఏపీ) కి అప్పులు ఇచ్చే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జాతీయి బ్యాంకులను హెచ్చరించింది. దీంతో, ఏపీఎస్డీసీ చట్ట బద్దత పై అనుమానాలు తలెత్తి, బ్యాంకులు ఏపీఎస్డీసీ కి రుణాలు ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో, ఎస్బీఐ రూ . 1800 కోట్ల మంజురైన రుణాన్ని నిలిపివేసిందని ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో సంక్షేమ పథకాల అమలుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి కావున, మరోవంక ఏపీఎస్డీసీ చట్టబద్దత రుజువు అయిన నేపద్యంలో ఎస్బీఐ, సహా ఇతర బ్యాంకులు ఏపీఎస్డీసీకి అప్పులు ఇచ్చేలా సూచించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను, ఇట్లు మీ విధేయుడు జగన్మోహన్ రెడ్డి .. అని లేఖలో పేర్కొన్నారు. అంటే, రాష్ట్రం అప్పులు ఏ స్థాయికి చేరాయో ... స్వయంగా ముఖ్యమంత్రి ప్రధానికి తెలియ చేశారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడవలసి వుంది. ఈ లేఖ రాసి నేఅల్ రోజుల పైనే అయినా ఇంతవరకు, సమధానం లేదు. అంటే ..అర్థం చేసుకోవడమే కానీ సమాధానం ఉండదు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/no-special-status-matter-in-cm-jagan-letter-to-pm-modi-25-131774.html





