వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష

Publish Date:Apr 11, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ రైల్వే కోర్టు జైలు శిక్ష విధించింది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి కేసులో ఆయనకీ శిక్ష పడింది.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది.  ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2016 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్‌నాథ్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.  అప్పట్లో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే,  ఆ సందర్భంగా అమర్‌నాథ్ ప్రాణహాని కలిగించుకునేలా వ్యవహరించారని పేర్కొంటూ అప్పట్లో టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న రైల్వే కోర్టు, తాజాగా  గుడివాడ అమర్ నాథ్ కుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.  దీనిపై గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ.. ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కోసం తాము చేసిన పోరాటంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం దురదృష్టకరమన్నారు. రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే, దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పిన గుడివాడ అమర్నాథ్ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం.. ఇప్పుడు లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.