‘పొత్తు’ పొడిస్తే వైసీపీకి చుక్కలే!

Publish Date:May 7, 2022

Advertisement

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మూడేళ్లలోనే తన పాలనా వైఫల్యాలతో నాడు తనకు మద్దతు పలికిన అన్ని వర్గాలలో అసహనం నింపేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఏ వర్గం తీసుకున్నా సంతోషంగా లేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. 
2019 ఎన్నికలలో అంత వేవ్ ఉండి కూడా మెజారిటీల పరంగా వైసీపీ అభ్యర్థులు చాలా వరకూ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు. పైగా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొని ఉంది. జగన్ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన మధ్య చీలిపోయింది.   2009 ఎన్నికలలో వలె తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి విజయం అంత సులువు అయ్యుండేది కాదు. 
అన్ని రంగాలలో వైఫల్యాలతో ప్రజాదరణను వేగంగా కోల్పోతున్న జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారేలోపే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని యోచన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశలకు ‘పొత్తు’లతో గండి కొట్టాలని విపక్షాలు స్కెచ్ వేస్తున్నాయి. పొత్తులు కుదిరితే వచ్చే ఎన్నికలలో వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎలా అంటే  2019లో వైసీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రత్యర్థులుగా వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో ఓట్ల చీలక వల్లనే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. పేరుకు 151 స్థానాలలో విజయం సాధించినా, నిజానికి వాటిలో దాదాపు 80 స్థానాలలో ఆ పార్టీ మెజారిటీ వేయి లోపే.. అంటే ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీ సీట్ల పరంగా భారీగా లాభపడింది. అదే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే... 2014 ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు వారు 2019 ఎన్నికల లెక్కలనే ఆధారాలుగా చూపుతున్నారు.  
 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలలో విజయం సాధించింది కానీ భారీ మెజారిటీ వచ్చిన స్థానాలు మాత్రం 60లోపే.  మిగిలిన స్థానాలలో వైసీపీ విజయం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లనేనన్నది వారి విశ్లేషణ. మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు.  జనసేన, తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా పోటీ చేసిన కారణంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం నష్టపోయింది. వచ్చే ఎన్నికలలో పొత్తుల వల్లనే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల కూడా తెలుగుదేశం ఈ సారి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్ష ఓటు చీలకుండా పొత్తులు ఉంటే.. వైసీపీ రెండో సారి అధికారంలోకి రావాలన్న కల సాకారమయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నారు. 
అలాగే తెలుగుదేశం పార్టీకి  గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి గత ఎన్నికలలో దాదాపు స్వీప్ చేసినంత పనైంది. అయితే ఆ ప్రాంతాల్లో మెజారిటీలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. ఇప్పడు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోనికి తీసుకుంటే గోదావరి జిల్లాలు; ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వపు ఆదరణ ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి. ఎలాగూ అక్కడ గట్టి పునాది ఉన్న తెలుగుదేశం పూర్వవైభవం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ, దానికి ‘పొత్తు’ బలం కలిస్తే ఎదురే ఉండదనీ అంటున్నారు.  అదే జరిగితే ఈ సారి ఎన్నికలలో 2019 ఎన్నికల నాటి సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.