జగన్‌కే చుక్కలు చూపించిన జేసీ బ్రదర్స్
Publish Date:May 7, 2022
Advertisement
వస్త్ర ప్రపంచంలో చందనా బ్రదర్స్.. టాలీవుడ్‌లో పరుచురి బ్రదర్స్.. ఏపీ పాలిటిక్స్‌లో జేసీ బ్రదర్స్.. వెండి తెర మీద పరుచురి బ్రదర్స్ డైలాగ్స్ ఎలా పేలతాయో.. ఏపీ పాలిటిక్స్‌లో అదీ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ జేసీ బ్రదర్స్ రాజకీయం అంత రంజు రంజుగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ జేసీ బ్రదర్స్ స్టైలే వేరు.. మాట.. నడక.. నడత అంతా సపరేటే. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాంటే.. సీమ భాషకు బూతులు జోడించి వీరు మాట్లాడుతుంటే.. ఓ విధమైన హాస్యం ఉట్టిపడుతోందని తెలుగు నేలపై రాజకీయం తెలియని వారు సైతం వీరి గురించి పేర్కొంటారు. ఈ జేసీ బ్రదర్స్ ఏదీ మాట్లాడినా.. ఏం చెప్పినా అంతా ముఖం మీదే చెప్పేస్తారు. నో రహస్యాలు.. నో మోహమాటాలు.. అంతా బొమ్మరిల్లు మూవీలో హీరోయిన్ హాసిని టైప్ అన్నమాట. అంతేకాదు ఈ బ్రదర్స్‌కి గట్స్ కూడా ఎక్కువే. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను మీడియా సాక్షిగా నట్ట నడిరోడ్డు మీద బండ బూతులు తిట్టినా అదీ ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికే చెల్లింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గారు.. మీరు మారాలండి అంటూ లక్షలాది మంది హాజరైన మహానాడు వేదికగా చెప్పినా.. అదీ జేసీ దివాకర్ రెడ్డికే చెల్లింది. ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో గెలిచాకా.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఈ జేసీ బ్రదర్స్‌కి గట్టి దెబ్బ తగిలింది. వీళ్ల వ్యాపారాలన్నీటికి అంటే అల్ మోస్ట్ ఆల్ అన్నింటికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. ఇది జస్ట్ విరామం మాత్రమేనని ఈ జేసీ బ్రదర్స్ సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఫ్యాన్ పార్టీ జెండ రెపరెపలాడింది. కానీ వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి మున్సిపాలిటిలో మాత్రం సైకిల్ పార్టీ జెండా రెపరెపలాడడంతో.. ఆ పార్టీ నేతల్లో విజయ గర్వం సైతం తొణకిసలాడింది. ఇది జేసీ బ్రదర్స్ సత్తా అని సీఎం జగన్‌కు సైతం అర్థమైందని ఫ్యాన్ పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం. ఓ వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనకు కసరత్తు జరిగుతోంటే.. రాయల్ తెలంగాణ అంటూ కొత్త పల్లవి అందుకున్నారీ దివాకరరెడ్డి. అంతేకాదు.. తమ మాటకు విలువివ్వని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీడి.. తన తమ్ముడి ప్రభాకరుడితో సహా సైకిల్ పార్టీలోకి వచ్చేశాడీ దివాకరుడు.. ఆ తర్వాత అనంత ఎంపీగా ఆయన గెలవడం.. అలాగే ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఇద్దరు ఓటమిపాలైయ్యారు. కానీ తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి.. ఆ మున్సిపాలిటికీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు. అంతేకాదు.. సదరు మున్సిపాలిటిని ఆయన ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన తీరు పట్ల రాష్ట్ర ప్రజలే అచ్చెరువొందుతున్నారు. అలాగే తాడిపత్రి రహదారులు సైతం అద్దంలా మార్చారు ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి కొద్దిగా కామ్ అయినా.. రానున్న ఎన్నికల్లో మళ్లీ సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి.. జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని ఒక తాటిపైకి తీసుకు వస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ జేసీ బ్రదర్స్ పేర్లు దివాకర్, ప్రభాకర్.. అంటే ఒకటే అర్థం. ఈ బ్రదర్స్ భవిష్యత్తు ముందే ఊహించి మరీ వీరి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారని.. ఓ టాక్ అయితే అనంత జిల్లాలో మస్త్ మస్త్‌గా నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/jc-brothers-check-to-jagan-25-135579.html





