జగన్ మకాం మార్చేస్తారా?

Publish Date:Jul 13, 2022

Advertisement

తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని రాజు అంటే వందిమాగధులు కాదనక చస్తారా? ఏపీలో జగన్ పాలన అలాగే ఉంది. జగన్ ఔనంటే ఔను.. కాదంటే కాదు.. కేబినెట్, అధికార యంత్రాంగం పరిస్థితి అంతే ఇప్పుడు జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీకి రాజధాని లేకండా చేశారన్న విమర్శలను తిప్పి కొట్టడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

ఏకంగా తన మకాం విశాఖకు మార్చేసి అక్కడ నుంచే పాలన సాగించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా రాష్ట్రంలో 175కు 175అసెంబ్లీ స్థానాలలో విజయమే లక్ష్యంగా పని చేయాలన్న పిలుపు ఇచ్చిన ఆయన ఎన్నికలకు రెడీ అయిపోవాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారు. అమరావతిని ఇప్పటికే నిర్వీర్యం చేసిన జగన్ ఇక దాని ఊసు కూడా రాష్ట్రంలో ఎవరూ ఎత్తకుండా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించేసుకున్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భవనాల అన్వేషణ కూడా సాగిస్తున్నారు. వారంలో ఐదు రోజులు విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగించేందుకు సర్వం సిద్ధం చేసేశారు.  అమరావతి విషయంలో కోర్టు తీర్పు తరువాత నుంచి మూడు రాజధానులు అని జగన్ నోట ఎప్పుడు వచ్చినా జనం దానిని ఓ పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.  అన్ని విధాలుగా పాలనకు అనువుగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంచిన అమరావతికి దిక్కు లేదు కానీ మూడు రాజధానులా అని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల పాటను పక్కన పెట్టి విశాఖ కేంద్రంగా పాలన సాగించడం ద్వారా అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేశానన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందుకు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నుంచి అమరావతి నుంచి సాధ్యమైనంత త్వరగా (పారి)పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

అమరావతి అభివృద్ధి కోసం అంటూ అక్కడి భూములను అమ్మకానికి పెట్టి, చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వడానికి నిర్ణయించేసి.. సాధ్యమైనంత సొమ్ము దండుకుని.. కోర్టు తీర్పు అమలు చేస్తున్నామని చెబుతూనే ఆ పనులు నత్తనడకన సాగిస్తూ.. కర్నూలు న్యాయరాజధాని అన్న మాట ఎత్తకుండానే.. పాలనా రాజధానిగా తాను మొదటి నుంచీ చెబుతున్న విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని జగన్ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.   అమరావతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి చిన్నచిన్న పనులు చేస్తూ.. జగన్ తన మకాం విశాఖకు మార్చేయనున్నారని పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం.

అయితే పాలనా రాజధాని అని విశాఖకు మకాం మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయన్న భయంతోనే క్యాంపు కార్యాలయం పేర కొత్త నాటకానికి తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మకాం విశాఖకు మారిస్తే అందరి దృష్టినీ ప్రజా సమస్యల నుంచి మళ్లించే అవకాశం ఉంటుందనీ, విపక్షాలు, ప్రజలూ కూడా విశాఖ నుంచి పాలన అన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ, రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చనీయాంశంగా మారుతుందనీ, పాలనా వైఫల్యాలపై విమర్శల దాడి ఆగిపోతుందనీ  జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.