కొండా సురేఖను బుజ్జగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఢిల్లీ నుంచి పిలుపు..!

Publish Date:Sep 12, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. 

పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.  

తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  
 

 

 

[ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.