ఏపీలో ప్రభుత్వ కనుసన్నల్లో ప్రకృతి విధ్వంసం!

Publish Date:Jul 13, 2022

Advertisement

ప్రకృతి సమతుల్యం దెబ్బతింటే జరిగే విధ్వంసం ఊహకు అందనిది. అందుకే ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.ప్రపంచదేశాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరుపుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో కూడా ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు, అందుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉంది. అయితే ఏపీలో ప్రభుత్వం కనుసన్నలలో యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. విపత్తులను సహజ రక్షణగా నిలుస్తున్న అడవులు నరికేస్తున్నారు. కొండలు తవ్వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కనుసన్నలలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో వారి పర్యవేక్షణలో సాగుతోంది. ఈ విధ్వంసం అంతా ప్రభుత్వ పెద్దల స్వ ప్రయోజనం కోసమే జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కోసం లేటరైట్‌, బాక్సైట్‌ ఖనిజాల దోపిడీ జరుగుతుంటే.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై తెలుగుదేశం  ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. కొండలను తవ్వేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. భవిష్యత్ తరాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. ఐదేళ్ల పాటు ప్రజల సంపదకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు స్వయంగా దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారు. కొండలను పిండి చేసేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. ఖనిజాలను తవ్వేస్తున్నారు. ఇది నిజంగా దారుణం, దౌర్భాగ్యం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీపై ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ప్రభుత్వం పాల్పడుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ ప్రకృతి విధ్వంసం.. కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందన్నారు.

రుషి కొండను బోడి కొండ చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ తవ్వకాలను ఆపాలని స్టే ఇచ్చినా లెక్క చేయలేదు. చివరికి సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేసింది. అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ఇక కర్నూలులో రవ్వల కొండను పిండి చేశారు. కొండను తవ్వేసిన వారిని వదిలేసి తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కేసులు పెట్టి వేధించిందీ ప్రభుత్వం అంటూ విమర్శించారు.మన్యంలోని భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి భారతీ సిమెంట్స్‌కు పంపిస్తున్నారు.  

కుప్పం పరిధిలోని శాంతిపురంలో విలువైన గ్రానైట్‌ కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారు.    తెలుగుదేశం ఆ స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చి అందులో మూలికల మొక్కలు పెంచాలని భావించింది. ఇప్పుడు ఆ వర్సిటీ రిజిస్ట్రారే దగ్గరుండి అక్రమతవ్వకాలు జరిపిస్తున్నారు. ఇవేమీ తెలుగుదేశం చెబుతున్న మాటలు కావు. ఎక్కడ ఏ కొండను తవ్వేసింది. ఎక్కడెక్కడ అడవులను నరికేసింది అన్నీ గూగుల్ మ్యాప్ లో స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబు అన్నారు.  

కాకినాడలో మడ అడవుల నరికివేత ఇష్టానుసారంగా సాగుతుంటే అటవీ శాఖ ఏం చేస్తోందని నిలదీశారు.   అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏకంగా 62 మంది మరణించడానికి కారణం అక్రమ ఇసుక తవ్వకాలు కాదా. ఇసుక మాఫియా విచ్చలవిడి గా ఇసుకను తవ్వేయడమే అందుకు కారణమని బాబు ధ్వజమెత్తారు.  చిత్తూరు జిల్లా బండపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో మొత్తం 75 చోట్ల ఇటువంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు తాను చేసిన ప్రతి ఆరోపణనూ నిరూపించడానికి సిద్ధమన్నారు.ఇప్పటికైనా వీటిని అడ్డుకోకుంటే చరిత్ర హీనులుగా మారిపోతారని ఆయన అధికారులను హెచ్చరించారు. మైనింగ్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులూ, సీఎస్ సహా తప్పు చేసిన ఏ అధికారనినీ వదలబోమనీ, అందరినీ చట్టం ముందుకు తీసుకువస్తామని చంద్రబాబు అన్నారు. కూడా ముందుకు రావాలి. చర్యలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరెక్కడున్నా తప్పు చేసిన అందరినీ చట్టం ముందుకు తెస్తాం’ అని చెప్పారు.  
 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.