బాలినేని పక్క చూపులు.. టికెట్ హామీ దక్కితే జంపే!

Publish Date:Dec 19, 2023

Advertisement

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా?  ఒక మాజీ మంత్రి,  పార్టీ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా?  ఆయన పక్క చూపులతో  జిల్లా రాజకీయాలు కీలక మార్పులు ఉండనున్నాయా? ఇదే ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలలో   ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారనేది ప్రధానంగా ఆయన ఆరోపణ. అలాగే సొంత పార్టీ నేతలే భారీ కబ్జాలకు పాల్పడుతన్నారన్నది మరో ఆరోపణ. అధిష్టానం పలుమార్లు బాలినేనిని పిలిచి బుజ్జగించి హామీలిచ్చింది. కానీ ఆ హామీలు నెరవేర లేదు. బాలినేని చల్లబడలేదు. దీంతో ఈ మధ్య కాలంలో పూర్తిగా రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయి వాయిస్ వినిపిస్తున్నారు.

కాగా  బాలినేని ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని జిల్లా రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది. ఒకవైపు సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపి నియోజకవర్గ ఇన్ చార్జిగా మార్చారు.  ఒంగోలుకు ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. అదే సమయంలో బాలినేని వైసీపీలోనే ఉంటే.. ఆయనను ఎక్కడకి పంపిస్తారన్న చర్చ కూడా జరుగుతున్నది. అయితే  ఈలోగా అసలు బాలినేనే పార్టీ ఫిరాయించడం ఖాయమన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్నది. బాలినేని వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళ్తారన్నది మరింత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బాలినేని స్థాయి వ్యక్తి పార్టీ మారడం అంటే మామూలు పరిస్థితుల్లో ఆయనకు తెలుగుదేశం మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం వద్దనుకున్నా  జనసేన  మరో అప్షన్ అవుతుంది.  కానీ ఇప్పడు ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండడమే బాలినేనికి ఇబ్బందిగా మారినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

 ఒంగోలు స్థానం నుండి దామచర్ల జనార్దన్  తెలుగుదేశం ఇన్ చార్జ్ గా ఉన్నారు. దామచర్ల కుటుంబానికి  తెలుగుదేశంతో విడదీయరాని బంధం. కొండెపి నియోజకవర్గానికి చెందిన జనార్దన్ తాత ఆంజనేయులు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేయగా.. కొండెపి ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జనార్దన్ ఒంగోలుకు మకాం మార్చారు. జనార్దన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా.. గత ప్రభుత్వంలో ఒంగోలు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేతగా కూడా  పేరుంది.  గత ప్రభుత్వంలోనే మంత్రి కావాల్సి ఉండగా.. సామజిక సమీకరణాలలో భాగంగా అది వీలుపడలేదు. 2019లో జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో ఒంగోలులో జనార్దన్ ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఇక్కడ జనార్దన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నది ఇప్పుడున్న టాక్. మరోవైపు కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి కూడా దామచర్ల కుటుంబానికి విధేయుడు కాగా.. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గాన్ని కూడా   ప్రభావితం చేయగల సత్తా జనార్దన్ ది. అలాంటి జనార్దన్ ను పక్కకి పెట్టి టీడీపీ బాలినేనిని తీసుకొనే సాహసం చేయలేదు. 

ఇక మిగిలింది జనసేన. బాలినేని ఒంగోలు టికెట్ హామీ ఇస్తేనే జనసేనలో చేరే అవకాశాలున్నాయి. కానీ  పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ సీటు జనసేనకి వదులుకునే అవకాశాలు బహు స్వల్పం. 2024లో టీడీపీ గెలిచే స్థానం ఏదంటే అది ఒంగోలు అని బల్ల గుద్ది చెప్తాయి టీడీపీ శ్రేణులు. అలాంటి సీటును జనసేనకి వదులుకోవడం అంటే కష్టమే. అయితే  ఇక్కడ ఒక అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా జనార్దన్ ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశం ఉండగా.. ఆయనను కందుకూరు పంపించే ఛాన్స్ ఉంటుంది. కందుకూరులో ఇప్పుడు కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు ఇంచార్జిగా ఉండగా.. ఇక్కడ ఆయనకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు. జిల్లాపై దామచర్ల పెత్తనం అలాగే ఉండేలా.. మంత్రి పదవి హామీతో ఆయనను కందుకూరుకి పంపించి.. ఒంగోలు జనసేనకి కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎంతమేర జరుగుతుందో చెప్పలేం కానీ.. ఉన్న ఒకే ఒక్క అవకాశం మాత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ మేరకు బాలినేనికి  హామీ దక్కుతుందా అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే వస్తోంది.

By
en-us Political News

  
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.