వైసీపీలోకి ముద్రగడ?

Publish Date:Dec 19, 2023

Advertisement

కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కానున్నారా? ముద్రగడ అధికార పార్టీ వైసీపీలో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2019 ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముద్రగడ తెలుగుదేశం, జనసేన పొత్తు  ఉంటుందన్న చర్చ మొదలవగానే మళ్ళీ బయటకొచ్చారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయనపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు  కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారన్న ముద్రగడ వ్యాఖ్యలకు.. జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ఆ తర్వాత కూడా అడపాదడపా పవన్ యాత్రల సమయంలో ముద్రగడ పలు వ్యాఖ్యలు చేశారు. కానీ, ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు.. ఆ వ్యాఖ్యలు కూడా వినిపించలేదు. కాగా, ముద్రగడ వెనక వైసీపీ వ్యూహం ఉందన్నది చాలా కాలంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మధ్య ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు కూడా ప్రచారం జరిగింది. జనసేనపై ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. అప్పుడే వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుండే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఆ తర్వాత విశాఖ  వెళ్లిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ కూడా అయ్యారు. అప్పుడే ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని నిర్ధారణయింది.

కాగా, ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చిందంటున్నారు. జనవరి 2న ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పద్మనాభం కుమారుడు చల్లారావుకు వైసీపీ నుండి టికెట్ హామీ దక్కినట్లు తెలుస్తున్నది. ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీ, లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా రంగంలోకి దింపే అవకాశాలున్నాయి,  అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోట శ్రీవాణి స్ధానంలో ఈసారి ఆమె భర్త తోట నర్సింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం సీటు కూడా ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే చల్లారావును పెద్దాపురం ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వారం రోజులలోనే ఈ రెండు స్థానాలలో చల్లారావును ఎక్కడ నుండి పోటీకి దింపాలన్నది ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతనే ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో పవన్  తెలుగుదేశంతో కలిసి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కాపు ఓటును డైవర్ట్ చేసేందుకే వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను పార్టీలో చేర్చుకుంటున్నది.  ఈ వ్యూహం ఎంతవరకు వైసీపీకి కలిసి వస్తుందో చూడాలి.

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.