అయోధ్య రామమందిర నిర్మాణంలో తెలుగు సంతకం.. డాక్టర్ శివనాగిరెడ్డి
Publish Date:Dec 19, 2023
Advertisement
యావద్భారతావణి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయోధ్య రామమందిర ప్రవేశ ముహూర్తం దగ్గరకొచ్చేసింది. ఈ మహత్తర ఆలయ నిర్మాణంలో తెలుగు సంతకం చిరస్మరణీయంగా విరాజిల్లనుంది. దేశంలో అత్యంత పురాతన, చారిత్రాత్మక దేవాలయాల నమూనాలతో అయోధ్యలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మ్యూజియం ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్‌పై నిపుణుల కమిటీ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు , స్తపతి అయిన డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు ఆలయ శిల్పకళలో నాలుగేళ్లు శిక్షణ పొంది ఎస్ వి యూనివర్సిటీ నుంచి బీకాం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర , పురావస్తు శాస్త్రంలో ఎంఏ , హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో పి హెచ్ డి పట్టాలను పొందిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 1978లో దేవదాయ శాఖలోనూ, 1981 నుంచి రాష్ట్ర పర్యాటక శాఖలో స్థపతిగా పనిచేశారు. 2013లో పదవి విరమణ చేశారు. అంతకు ముందు 2004 నుంచి 2005 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలటీ మేనేజ్ మెంట్ లో ప్రొఫెసర్ గా , డీన్ గా , 2011 డైరెక్టర్ గా పనిచేశారు . 2013 నుంచి 2017 ఫిబ్రవరి వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ గా , ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ప్రత్యేక అధికారిగా పనిచేశారు. చరిత్ర , శాసనాలు , పురావస్తు శాస్త్రం, పర్యాటకం, బౌద్ధం వీటిపై అనేక పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన క్రీస్తుశకం 7 నుండి 17 వ శతాబ్దాలకు చెందిన 100కు పైగా దేవాలయాలను తొలగించి ఎగువన పునర్నిర్మించారు. అయోధ్య ప్రాంగణంలో తెలుగు సంతకం గుర్తులు యావత్ తెలుగు ప్రజలకు గర్వ కారణం అనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/telugu-signature-in-ayodhya-rama-mandir-25-167317.html





