ఆడపిల్లను దూరంగా ఇచ్చి పెళ్లి చెయ్యడానికి  తల్లిదండ్రులు ఇష్టపడరు ఎందుకు..?

Publish Date:Feb 4, 2026

Advertisement

 


అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి.  ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తారు. అబ్బాయి ఉద్యోగం,  సొంతిల్లు ,  సంపాదన, ఆస్తిపాస్తులు,  అబ్బాయి అలవాట్లు.. ఇవి మాత్రమే కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిని తమకు ఎంత దగ్గర ప్రాంతంలో వీలైతే అంత దగ్గరలో ఇవ్వాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేని అమ్మాయిల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేయగానే ఒకరిని ఒకరు చేరుకునేట్టుగా ఉండే ప్రాంతాలకు ఇవ్వాలని ఆశిస్తారు.  దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

చేరుకోవడం తేలిక..

దగ్గరగా నివసించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఒకరినొకరు కలవడానికి  అడ్డంకులు తక్కువగా ఉండటం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు కూతురిని చూడవచ్చు, కూతురు తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు.

చిన్న,  పెద్ద సమస్యలు,  అపార్థాలను వెంటనే పరిష్కరించవచ్చు. ఇది సంబంధంలో పారదర్శకతను తెస్తుంది,  పరస్పర విశ్వాసాన్ని బలపరుస్తుంది.

దగ్గరగా ఉండటం వల్ల, రెండు కుటుంబాలు ఒకరి మనస్తత్వాన్ని,  వారి అవసరాలను సులభంగా అర్థం చేసుకోగలవు, ఇది సంబంధంలో సామరస్యాన్ని పెంచుతుంది.

సమయం, ఖర్చు..

కూతురిని దూరంగా ఇచ్చినప్పుడు ఆమెను చూసి రావడానికి  తరచుగా ఎక్కువ సమయం,  డబ్బు ఖర్చవుతుంది.  ప్రయాణాలు, ఫోన్ కాల్స్,వాహన సదుపాయం మాత్రమే కాకుండా  ప్రయాణానికే ఉన్న సమయం అంతా గడిపోతుంటుంది. దీని  వల్ల సంబంధాలకు సమయం కేటాయించడంలో ఒత్తిడిని కలిగిస్తుంది.

దగ్గర ఉన్న సంబంధాలకు ఇాలాంటి సమస్యలు ఉండవు.  చిన్న చిన్న పండుగలు,శుభ సందర్భాలను కూడా  కుటుంబంతో పంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. ఆర్థిక, మానసకి భారాన్ని తగ్గిస్తుంది.

వాతావరణం..

దగ్గరి ప్రాంతంలోనే అమ్మాయిని ఇవ్వడం వల్ల ప్రాంతీయత, అలవాట్ల సమస్య ఉండదు. ఆహారపు అలవాట్లు,  పద్దతులు కూడా తెలిసి ఉంటాయి.  ఇది మనుషుల్లో కలిసిపోవడానికి బాగా సహాయపడుతుంది.

సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో పెద్దగా తేడా లేకపోతే, రెండు కుటుంబాలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడంలో ఎటువంటి సమస్య ఉండదు.
ఈ ఉమ్మడి పునాది సంబంధాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా,  బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

పిల్లల పెంపకం..

తల్లిదండ్రుల ఇల్లు,  అత్తమామల ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నప్పుడు,  పిల్లలను పెంచడంలో మంచి సపోర్ట్ లభిస్తుంది.  ఉద్యోగం కారణంగా నేటి కాలంలో వారు పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దగ్గరలోనే రెండు కుటుంబాలు ఉంటే పిల్లల విషయంలో మంచి సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలకు రెండు కుటుంబాల  ప్రేమ,  మద్దతు కూడా లభిస్తుంది.

ప్రతికూలతలు..

కుటుంబాలు దగ్గరలో ఉండటం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉంచాయి.  రెండు కుటుంబాలు ఆరోగ్యకరమైనవి అయితే సమస్య లేదు. కానీ కేవలం అమ్మాయి మాత్రమే కావాలని, ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబం మాకు అవసరం లేదని అనుకునే అత్తింటి వారితో ఇలా దగ్గరగా ఉండటం వల్ల అటు ఆడపిల్ల తల్లిదండ్రులు,  ఆ అమ్మాయి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులు దగ్గర  ఉంటే ఏ చిన్న గొడవ జరిగినా ఆడపిల్ల తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడుతుంది.  ఇది అత్తింటితో అనుబంధాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది.

ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు అల్లుడి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం,   ఆడపిల్లకు చెడు మాటలు నేర్పి  కుటుంబాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.

అయితే.. దూరం సంబంధం అయినా, దగ్గరి సంబందం అయినా..  రెండు కుటుంబాలు  ఆరోగ్యకరంగా ఉండే విదానం మీదనే సంబంధాలు నిలబడతాయి, సంతోషంగా ఉంటాయి.

                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.