జల రవాణా స్వరూపాన్నే మార్చేసిన ఘట్టం.. స్టీమ్ బోట్ చరిత్ర ఇది..!

Publish Date:Feb 11, 2026

Advertisement

రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల కాలం నుండే జల రవాణా సాగుతోంది. అయితే ఒకప్పుడు జల రవాణాకు ఎంతో సమయం తీసుకునేది. కానీ స్టీమ్ బోట్ జల రవాణాను చాలా సులభతరం చేసింది.  జల రవాణా చరిత్రలో స్టీమ్ బోట్ ఒక కీలక మలుపు. ఇంతకీ ఈ స్టీమ్ బోట్ ఎవరు, ఎప్పుడు తయారు చేశారు.  ఇది జల రవాణాను ఎలా సులభతరం చేసింది.  తెలుసుకుంటే..


జల రవాణా నిర్వచనాన్నే మార్చిన రోజుగా ఫిబ్రవరి 11 చరిత్ర పుటల్లో లిఖించబడింది. సరిగ్గా 217 సంవత్సరాల క్రితం, ఫిబ్రవరి 11, 1809న, అమెరికన్ ఆవిష్కర్త రాబర్ట్ ఫుల్టన్ స్టీమ్‌బోట్‌కు పేటెంట్ పొందాడు. నది ద్వారా వ్యాపారం,  ప్రయాణం చాలా సవాలుతో కూడుకున్నదిగా పరిగణించబడిన సమయం ఇది. అలాంటి సమయంలో  రాబర్ట్ ఫుల్టన్ ఆవిష్కరణ విప్లవాత్మకమైనది.

 ఫుల్టన్ ఆలోచన..

ఫుల్టన్ ఆవిష్కరణకు ముందు పడవలను ఓర్ల ద్వారా నడిపించేవారు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండటమే కాకుండా నావికులకు చాలా అలసిపోయేలా చేసేది. రాబర్ట్ ఫుల్టన్ ఈ సమస్యకు ఆవిరి యంత్రం,  తెడ్డు చక్రం యొక్క పూర్తీ కాంబినేషన్ లో  ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ప్రయాణాన్ని వేగంగా, చౌకగా నిరంతరంగా కొనసాగేలా చేసింది. సమయాన్ని చాలా పొదుపు చేసింది.

మొదటి చారిత్రాత్మక యాత్ర..

1807 ఆగస్టు 17న, రాబర్ట్ ఫుల్టన్ పడవ క్లెమాంట్, హడ్సన్ నదిపై తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. క్లెమాంట్ న్యూయార్క్ నుండి అల్బానీకి 240 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 32 గంటల్లో పూర్తి చేసింది. ఆ కాలంలోని సాంప్రదాయ పడవలు అదే దూరాన్ని అధిగమించడానికి దాదాపు నాలుగు రోజులు పట్టేవి.  తిరుగు ప్రయాణంలో పడవ మరింత వేగంగా ప్రయాణించి కేవలం 30 గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేసింది.


అందరూ ఎగతాళి చేశారు..

మొదట్లో  ప్రజలు స్టీమ్ బోట్ గురించి భయపడ్డారు. నల్లటి పొగ, ఇంజిన్ శబ్దం,  ఎగిరే నిప్పురవ్వలు చూసి ప్రజలందరూ రాబర్ట్ ఫుల్టన్‌ను ఒక మూర్ఖుడిగా పిలిచారు.  కానీ పడవ 60 మంది ప్రయాణికులను తీసుకెళ్లినప్పుడు, ఆ ప్రయాణం విజయవంతం అయినప్పుడు అందరి ఆలోచన మారిపోయింది.

వాణిజ్యంలో కొత్త ఊపు..

స్టీమ్‌బోట్ విజయం న్యూయార్క్,  అల్బానీ వంటి నగరాల మధ్య రోజువారీ సేవలకు ఎంతో సహాయపడింది.  24-హార్స్‌పవర్ ఇంజిన్,  రెండు పెద్ద తెడ్డు చక్రాలతో కూడిన ఈ పడవ సరుకు రవాణాను చాలా సులభతరం చేసింది. ఈ ఒకే ఒక ఆవిష్కరణ నది వాణిజ్యాన్ని విస్తరించడమే కాకుండా అమెరికన్ వెస్ట్‌లో ఆర్థిక అభివృద్ధికి కూడా మార్గం తెరిచింది. కాలక్రమేణా ఫుల్టన్ తన పడవను మరింత మెరుగుపరిచాడు, దానిని మరింత సురక్షితంగా మార్చాడు.  భవిష్యత్తులో జల రవాణాకు కొత్త తలుపులు తెరిచాడు.


                              *రూపశ్రీ.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.