వాలెంటైన్స్ డే.. వాలెంటైన్స్  వీక్ వెనుక ఇంత చరిత్ర ఉందని మీకు తెలుసా?

Publish Date:Feb 13, 2026

Advertisement


వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ,  ఒకో రోజు ఒకో విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఇందులో ప్రేమ అయినా, స్నేహం అయినా,  అభిమానం అయినా ఏదైనా సరే.. ఆ బంధం పట్ల ఉన్న ప్రేమను,  అభిమానాన్ని వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ వీక్ బాగా సహాయపడుతుంది. అయితే రోజ్ డే తో మొదలయ్యే ఈ హడావిడి వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

రోజ్ డే..

వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజును రోజ్ డే గా జరుపుకుంటారు. రోజ్ డే అంటే కేవలం పువ్వులు బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు. ఇది ఎమోషన్స్ ను అంగీకరించడం అనే విషయాన్ని కూడా చాటి చెప్తుంది. ఎర్ర గులాబీలు లోతైన ప్రేమ,  అభిరుచిని సూచిస్తాయి. పసుపు గులాబీలు స్నేహం,  ఆనందాన్ని సూచిస్తాయి. గులాబీ రంగు గులాబీలు ఎదుటి వారిని మెచ్చుకోవడాన్ని వ్యక్తపరుస్తాయి. తెల్ల గులాబీలు శాంతి,  కొత్త ప్రారంభాలను సూచిస్తాయి.


ప్రపోజల్ డే..

వాలెంటైన్స్ వీక్ లో రెండవ రోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ఈ రోజు తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది.

చాక్లెట్ డే..

చాక్లెట్ అంటే తీపిదనం, ఆనందం.  ఈ రోజున ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రేమించిన వారితో గడిపే క్షణాలు మరింత సంతోషంగా,  మరిచిపోలేనిది చేయాలని చెప్పడమే చాక్లెట్ ఇవ్వడంలో అంతరార్థం  అని చెబుతున్నారు.

టెడ్డీ డే..


టెడ్డీ డే వాలెంటైన్ వీక్ లో  నాల్గవ రోజు.  ఫిబ్రవరి 10 న వస్తుంది. ఈ రోజున జంటలు  అంతులేని ప్రేమ,  స్నేహానికి గుర్తుగా  టెడ్డీ బేర్‌లను ఇచ్చి పుచ్చుకుంటారు.


ప్రామిస్ డే..

ప్రామిస్ డే కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.  భాగస్వామిని ఎల్లప్పుడూ బేషరతుగా ప్రేమిస్తానని వాగ్దానం చేయడమే ప్రామిస్ డే లో ఉన్న ముఖ్య భాగం. బలమైన సంబంధానికి పునాది వాగ్దానంపై  ఆదారపడి ఉంటుంది.  అందుకే ప్రామిస్ చేస్తారు.

హగ్ డే..

కౌగిలింత ఉద్రిక్తతలను తగ్గించి  ఉత్సాహపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమను వ్యక్త పరిచేందుకు వాలెంటైన్ వీక్ లో ఆరవ రోజుగా హగ్ డే ను జరుపుకుంటారు.  కౌలిగి ఒక భరోసా ఇస్తుందని చెబుతారు.

కిస్ డే..

వాలెంటైన్ వీక్ లో ఏడవ రోజును కిస్ డే గా జరుపుకుంటారు.  ప్రేమించిన భాగస్వామికి ముద్దు పెట్టడం ద్వారా తమ ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు.

ప్రేమికుల దినోత్సవం..

చివరగా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.  ఎల్లలు లేని ప్రేమను చాటిచెబుతూ జీవితాంతం ఒకరికొకరు ఉంటామని తెలియజేసుకునే రోజు ఇది.  అయితే ప్రేమకు గౌరవం దక్కినప్పుడే అది విలువైనదిగా ఉంటుంది.  ప్రేమను ఎప్పుడూ పరిహారం చేయకూడదు. అలాగే ప్రేమను తమ విచ్చలవిడితనానికి వాడుకోకూడదు.  

                              *రూపశ్రీ

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.