మామిడిపండ్లను తినేముందు నీటిలో కొద్దిసేపు ఉంచి తినాలి ఎందుకో తెలుసా?

Publish Date:Apr 24, 2024

Advertisement

వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఆ ఎదురు చూపులు అన్నీ మామిడికాయల కోసమే. పండ్లలో రారాజు అని చెప్పుకునే మామిడికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సమ్మర్ లో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే చాలు..  ఎంత ధర అయినా కొనేసి వాటి రుచిని ఆస్వాదించేవారు ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇంట్లో మామిడి కాయలు ఉంటే అమ్మలో, అమ్మమ్మలో ముందే వాటిని నీళ్లున్న టబ్ లో వేసి ఓ గంటాగిన తరువాత తినడానికి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. మామిడి పండ్లను ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక మండుతున్న ఎండల్లో హాయిగా చల్లగా తింటూ ఉంటారు. అయితే ఇది తప్పని ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మార్గమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు మామిడిపండ్లను నీటిలో ఎందుకు ఉంచాలి? దీనివెనుక గల ఆరోగ్య రహస్యం ఏంటి? తెలుసుకుంటే...


నీళ్లలో కొద్దిసేపు ఉంచిన మామిడిపండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. నిజానికి మామిడిపండు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియ,  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కానీ ఈ సమస్యను నీటిలో కాసేపు ఉంచడం ద్వారా తగ్గించుకోవచ్చు.

మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాని అధిక పరిమాణం కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడే  అవకాశం ఉంటుంది . అయితే మామిడిని కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు.


ఈ రోజుల్లో ప్రతి పంటకు  హానికరమైన పురుగుమందులు,  ఎరువులు అధిక పరిమాణంలో  ఉపయోగిస్తారు. మామిడి సాగులో కూడా ఇవి తప్పనిసరి. ఇవి మామిడి తొక్కపై ఉంటాయి.  ఇవి తినేటప్పుడు  శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మామిడిని కనీసం అరగంట నుండి గంట సేపైనా నీటిలో ఉంచడం అవసరం. తద్వారా వాటిపై ఉన్న పురుగుమందులు తొలగిపోతాయి.


మామిడిలో కొంత మొత్తంలో తెల్లని స్రావం ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు,  అలెర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల  స్రావం తగ్గుతుంది.   తద్వారా చర్మ సమస్యలు ఏవీ ఇబ్బంది పెట్టవు.


మామిడికాయను నీళ్లలో ఉంచకుండా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల కొంత సమయం పాటు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.  మామిడిని నీటిలో ఉంచి తింటే అందులో హైడ్రేటింగ్ లక్షణాలు పెరుగుతాయి.


                                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.