యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ఈ విషయాలు తెలుసా?

Publish Date:Apr 25, 2024

Advertisement

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

మధుమేహ రోగులకు..

యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.  మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.

బరువు..

యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి  ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది.  ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.   ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది.

గుండె ఆరోగ్యం..

చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా,  రక్తపోటును నియంత్రించడం అయినా..  ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా  సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.   ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చర్మ ఆరోగ్యం..

యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం  దురద, ఎరుపు,  చర్మ అంటువ్యాధులు మొదలైన  సమస్యలలో  బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా తీసుకోవాలి..

యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి.  5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి.  ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి.  దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు,  చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు   వైద్యుడిని సంప్రదించడం మంచిది.


                                        *రూపశ్రీ.
 

By
en-us Political News

  
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.