నిద్రలో ఎప్పుడైనా నరాలు లాగేస్తుంటాయా?  కారణాలు ఇవే కావచ్చు!

Publish Date:Apr 23, 2024

Advertisement

ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే ఉంటున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే.. కనీసం పోషకాహార లోపం, విటమిన్ల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారున్నారు. అయితే కొందరు రాత్రి సమయాలలో నిద్రపోయేటప్పుడు కాళ్లు లాగేస్తుంటాయి. ముఖ్యంగా కాలి లోపలి నరాలు మెలితిప్పినట్టు అనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు అవుతుంది?  వీటి వెనుక కారణాలేంటి?  తెలుసుకుంటే..


చాలామంది రాత్రి నిద్రసమయాలలో కాళ్లు లాగేస్తన్నాయని, నిద్ర పట్టడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. నిద్రలోనూ, విశ్రాంతి సమయాల్లో నరాలు లాగినట్టు లేదా నరాలు  ఉబ్బుతున్నట్టు కనిపించినా అవన్నీ  శరీరంలో పోషకాహార లోపం  వల్ల కలిగే ఇబ్బందులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


కొందరిలో నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాకుండా లేస్తున్నప్పుడు, కూర్చునేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో సిరలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దీనికి కేవలం పోషకాహార లోపం మాత్రమే కారణం కాదు. శరీరంలో నీరు, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.


శరీరంలో వేలకొద్ది నరాలు ఉంటాయి. వీటిని సిరలు అని కూడా సంభోదిస్తారు. ఈ సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ సరిగా లేకపోవడం. హిమోగ్లోబిన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

చాలామందికి తెలియని మరొక ముఖ్య కారణం విటమిన్-సి లోపం. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉండాలంటే ఐరన్ అవసరం. కానీ విటమిన్-సి లోపిస్తే శరీరం ఐరన్ ను గ్రహించలేగు. కాబట్టి విటమిన్-సి లోపం వల్ల ఐరన్ లోపం,హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం, రక్తహీనత, నరాల సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. విటమిన్-సి లోపం వల్ల కూడా   రాత్రి నిద్రపోతున్న సమయంలో నరాలు ఇబ్బంది పెడతాయి.

మద్యపానం తీసుకునే వారిలో నరాల సంబంధ సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మద్యపానం కూడా విటమిన్లు, ఐరన్ మొదలైనవి శరీరం గ్రహించకుండా చేస్తాయి.

                                                    *రూపశ్రీ.
 

By
en-us Political News

  
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.