హుజురాబాద్ కు కేటీఆర్ వెళ్లరట.. హరీష్ ను బలిపశువు చేయబోతున్నారా?
Publish Date:Oct 20, 2021
Advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. పోలింగ్ పది రోజుల్లోకి వచ్చింది. ప్రచారం వేడెక్కింది. నియోజక వర్గంలో మంత్రి హరీష్ రావుతోపాటుగా మరో అర డజను మందికి పైగా మంత్రులు ఓ రెండు డజన్ల మందికి పైగా ‘ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం శ్రమపడుతున్నారు. అయితే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్ మాత్రం ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అంతే కాదు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో తాను పాల్గొనడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ చిన్న ఎన్నిక అంటూ తేలిగ్గా తీసేశారు., హుజూరాబాద్’లో ఓడి పోయినా కొంపలేమీ కూలి పోవని, అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికపై కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ పైనల్ గా భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార పార్టీ కూడా తన బలగాన్ని మోహరించింది. హుజురాబాద్ కోసమే దళిత బంధును తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. ఉప ఎన్నిక చాల చిన్నదని చెప్పడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. తాము చేయించిన సర్వేల్లో ఓటమి ఖాయమని తేలడంతోనే కేటీఆర్ ముందే చేతులెత్తేశారా అన్న చర్చ వస్తోంది. ఓడిపోవడం ఖాయమని నిర్ధారించుకున్నారు కాబట్టే.. ఆయన హుజురాబాద్ ప్రచారానికి వెళ్లడం లేదని అంటున్నారు. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. ఓటమి భయంతోనే కేటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన లేదని, అదే ఓటమిభయంతో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్’ను సేఫ్ జోన్ లో ఉండేలా జగ్రత్ట్ పడుతున్నారని అంటున్నాయి. ముఖ్యంగా, తెరాస ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ నేతలు తెరాస అగ్ర ద్వయం టార్గెట్ గా విరుచుకు పడుతున్నాయి. హుజురాబాద్‌కు కేటీఆర్‌ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‌ను పంపించాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సారు, కారు, 16 అని 7 సీట్లు ఓడిపోయాడు. జీహెచ్ఎంసీలో గతంలో 99 సీట్లు గెలిస్తే.. ఈసారి 54 సీట్లు మాత్రమే గెలిచాడు. కేసీఆర్ భయపడి హుజురాబాద్‌కు కేటీఆర్‌ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‌ను పంపించాడు. హరీశ్, ఈటల మంచి మిత్రులు. కానీ వారి మధ్య చిచ్చుపెట్టి.. హరీశ్‌ను ఇంచార్జీగా పంపించారని చెప్పారు.
http://www.teluguone.com/news/content/why-ktr-not-going-to-huzurabad-campaign--25-124845.html





