డీజీపీ మారాలి.. దాడులను ఖండించిన బీజేపీ..
Publish Date:Oct 20, 2021
Advertisement
వాటిని దాడులంటారా? ఫ్యాక్షన్ కు పరాకాష్ట్ర. ఉన్మాదానికి నిలువుటద్దం. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? రాజారెడ్డి రాజ్యాంగమా? అంటూ టీడీపీ కార్యాలయాలపై జరిగిన వైసీపీ దాడులపై ప్రజలంతా మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా నాయకులంతా అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఇది అరాచక పాలనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సైతం వైసీపీ ఆగడాలను తీవ్రంగా ఖండించారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం మంచిది కాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ తరఫున ఇలాంటి అనైతిక సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డీజీపీ తీరునూ సోము తప్పుబట్టారు. టీడీపీ చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు కానీ, వైసీపీ చేసిన భౌతిక దాడులపై స్పందించలేదన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలని సోము వీర్రాజు సూచించారు.
http://www.teluguone.com/news/content/somu-veerraju-fire-on-ycp-and-dgp-somu-25-124842.html





