కేసీఆర్ కోపానికి అదే కారణమా?.. కాళ్లబేరానికి చినజీయర్, మైహోం రామేశ్వర్?
Publish Date:Feb 15, 2022
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్’కు చిన జీయర్ స్వామి మీద కోపమొచ్చింది. అది కూడా మామూలు కోపం కాదు, మహాగ్రహం. ఎందుకు, ఏమిటీ అనేది అందరికీ తెలిసిందే. చినజీయర్ స్వామి 12 రోజుల పాటు నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో, తనకు అవమానం జరిగిందని కేసీఆర్ అగ్రహించారు. ఆ ఆగ్రహంతోనే, ఆయన 12 రోజుల్లో ఒక్క రోజు కూడా అటు కన్నెత్తి చూడలేదు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం కేసీఆర్ దూరంగా ఉన్నారు. కనీసం ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రప్పించేందుకు, చినజీయర్ స్వామి, మైహోం రామేశ్వరరావు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా, ఫలితం లేక పోయింది. చివరకు, ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. ఈ కార్యక్రమం వాయిదాకు, స్వామీజీ, ఏ కారణాలు చెప్పినా, అసలు కారణం ముఖ్యమంత్రి ఆగ్రహం. కార్యక్రమాన్ని వాయిదా వేసి సమయం తీసుకుంటే ఈలోగా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే, స్వామీజీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ శాంతికల్యాణానికి సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా రప్పించాలని ప్రయత్నిస్తున్నారు చినజీయర్ అండ్ మైహోం రామేశ్వర్‌రావు. నిజమే. ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారాణాలు, శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో ఆయన (కేసీఆర్) పేరు లేకపోవడం ఒక ప్రధాన కారణం, కానీ,సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని చిన జీయర్ స్వామి ప్రశంసలతో ముంచెత్తటం, కేసీఆర్ ఆగ్రహానికి అసలు కారణమని అంటున్నారు. ఓ వంక ముఖ్యమంత్రి కేంద్రంపై యుద్ధం ప్రకటించి, ప్రధానిని టార్గెట్’గా మాటల యుద్దం సాగిన్స్తున్న సమయంలో, చినజీయర్ ప్రధాని మోడీ పాలనను మెచ్చుకోవడమే కాకుండా, ఆయన్ని ఏకంగా శ్రీరామచంద్రునితో పోల్చారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు ఆయనను మించిన, ‘సమతా మూర్తి’ ఇంకొకరు లేరని పొగడ్తలు కురిపించారు. ఈ నేపధ్యంలో అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయని, అందుకే ముగింపు వేడుకలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదని, అంటున్నారు. అయితే, కేసీఆర్ ఇలా అయినవారి మీద ఆగ్రహించడం ఇదే మొదటిసరి కాదు, ఉద్యమ కాలంలో, దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న జయశంకర్ సార్, విద్య సాగర్ రావు పై కూడా ఇలాగే, ఆగ్రహం ప్రదర్శించారని, అప్పట్లో కేసీఆర్’కు వ్యక్తిగత కార్యదర్శి హోదాలో సన్నిహితంగా మెలిగిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ‘నేనూ .. తెలంగాణ ఉద్యమంలో నా ప్రస్థానం’ అనే పుస్తకంలో విద్యాసాగర్ రావు, జయశంకర్ గార్ల వృత్తాంతం అనే వ్యాసంలో విపులంగా రాశారు.. తనను కాకుండా ఇంకొకరిని ఎవరు పొగిడిన కేసీఆర్ జీర్ణించుకోలేరు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్’ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి హైదరబాద్ చేరుకున్నారు. అదే సమయంలో తెలంగాణ సాధనే లక్ష్యంగా దేవేందర్ గౌడ్, సొంత పెట్టారు. ఆ పార్టీ ఆవిర్భావ సభకు, ప్రొఫెసర్ జయశంకర్’ సార్, అప్పట్లో కేసీఆర్’కు అత్యంత సన్నిహితంగా ఉన్న నీటి పారుదలరంగ నిపుణులు విద్యాసాగర్ రావు వెళ్లారు. సహజంగానే, దేవేందర్ గౌడ్’ను పొగిడారు. అంతే, కేసీఆర్ ఆ ఇద్దరితో మాటలు బంద్ చేశారు. ఆ ఇద్దరూ దిలీప్’కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్’ మమ్మల్ని పిలవడం లేదు. ఒక సారి నువ్వు మట్లాడ వలసి వస్తుందేమో” అన్నారు. అంతా చుసిన తర్వాత చివర్లో, కేసీర్,అన్న మాటలు వింటే, అయన నైజం అర్థమవుతుంది, చైనా జీయర స్వామి మీద అయన కోపానికి కారణం ఏమిటో అర్థమవుతుంది.కేసీఆర్ అప్పుదు దిలీప్’తో ఏమన్నారంటే “వీళ్ళను పెద్ద మనుషులనుకుని మనం గౌరవం ఇస్తే, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడు. వీళ్ళు దేవేందర్ గౌడ్’ను పొగుడుతారా ?’అంటూ ఆగ్రహాన్ని చూపారు. సో.. ఇప్పుడు చిన జీయర్ మీద కేసీఆర్ ఆగ్రహానికి అసలు కారణం ఏమితో వేరే చెప్పనక్కర లేదు, కదా..!
అది నిజమే అయింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ కేసీఆర్, అని కలిసినప్పుడు, ఆయన ఆ ఇద్దరిమీద తమ కడుపులో దాగున్న ఆగ్రహం మొత్తం వెళ్ళకక్కారు. దేవేందర్ గౌడ్ పార్టీ ఆవిర్భావ సభలో, జయశంకర్ సార్, చేసిన ప్రసంగం వీడియో, చూపించారు. అందులో జయశంకర్ సార్, “తెలంగాణకు దేవేందర్ గౌడ్’ ఒక వేగుచుక్క. అయన సారధ్యంలో తెలంగాణ రావాల్సి వుంది” అని అన్నారు. అలాగే, విద్యాసాగర్ రావు కూడ దేవేందర్ గౌడ్’ ను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారు.
http://www.teluguone.com/news/content/why-kcr-angry-on-chinna-jeeyar-swamy-25-131797.html





